నీచ స్థాయికి ఎల్లోమీడియా..

MP Vijayasai Reddy Twitte On Yellow Media - Sakshi

వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

సాక్షి, అమరావతి: న్యాయస్థానాల్లో వాదనలను కూడా నిష్పాక్షికంగా చూపలేని నీచ స్థాయికి ఎల్లో మీడియా దిగజారి పోయిందని ట్విట్టర్‌ వేదికగా వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ‘‘బాబు గారిని ఉతికి ఆరేసినా.. ప్రభుత్వానికి షాక్ అని రాయడం అలవాటై పోయింది. ప్రజలు విశ్వసించరని తెలిసినా, యజమాని బాబు మెచ్చుకుంటే చాలనే భావన అనుకుల మీడియాదంటూ’ ట్విట్టర్‌లో దుయ్యబట్టారు. (‘తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు’)

నాయీ బ్రాహ్మణులు, రజకులు, దర్జీలకు ఏటా పది వేల సాయం అందించే జగనన్న చేయూత పథకం దేశంలోనే వినూత్నమని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. ఈ వర్గాలకు నేరుగా నగదు బదిలీ చేయడం దేశంలో ఏ రాష్ట్రంలోనూ కనిపించదని పేర్కొన్నారు. కరోనా వల్ల ఆదాయ వనరులు తగ్గినా రూ.247 కోట్లు పంపిణీ చేసి పెద్ద మనసు చాటుకున్న జగన్ గారికి వారంతా రుణపడి ఉంటారని ఆయన ట్వీట​ చేశారు. (‘ఆ బాధ నీలో స్పష్టంగా కనిపిస్తోంది కిట్టన్నా’)

"తెలుగు ప్రజలతో చినబాబు సంబంధాలు పెట్టుకోలేకపోతున్నారు. ప్రజలంతా ఆయనను తిరస్కరించారు. ఇక కిమ్ జాంగ్ ఉన్ తదితర నేతలతో వ్యవహారాలు నడపడానికి చంద్రబాబు ఆయన్ను తెలుగుదేశం పార్టీకి అంతర్జాతీయ అధ్యక్షుడిగా చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తోంది" అని వ్యంగ్యంగా విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top