'ఇకనైనా ఎస్పీవై రెడ్డి చేసిన తప్పు తెలుసుకోవాలి' | MP mekapati rajamohan reddy slams chandrababu naidu, spy reddy | Sakshi
Sakshi News home page

'ఇకనైనా ఎస్పీవై రెడ్డి చేసిన తప్పు తెలుసుకోవాలి'

May 27 2014 12:00 PM | Updated on May 25 2018 9:17 PM

'ఇకనైనా ఎస్పీవై రెడ్డి చేసిన తప్పు తెలుసుకోవాలి' - Sakshi

'ఇకనైనా ఎస్పీవై రెడ్డి చేసిన తప్పు తెలుసుకోవాలి'

కేవలం తన ప్రాంత అభివృద్ధి కోసమే టీడీపీలో చేరానని నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి ఇకనైనా చేసిన తప్పు తెలుసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు.

న్యూఢిల్లీ : కేవలం తన ప్రాంత అభివృద్ధి కోసమే టీడీపీలో చేరానని చెబుతున్ననంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి వైఖరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తప్పుబట్టారు. ఆయన చేసిన తప్పులను ఇకనైనా తెలుసుకోవాలని మేకపాటి హితవు పలికారు. ఆయన మంగళవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఎన్నికల్లో మెజార్టీ సాధించిన చంద్రబాబు నాయుడు ...ఇతర పార్టీల నేతలను భయపెట్టో, ప్రలోభాలకు గురి చేయటమో మంచి పద్ధతి కాదన్నారు. ఇటువంటి అనైతిక చర్యలకు పాల్పడటం మానుకోవాలని హితవు పలికారు.

చంద్రబాబు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని మేకపాటి సూచించారు. బాబు ఇచ్చిన హామీలపై ప్రజలు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు ఎంపీ  బుట్టా రేణుక వ్యవహారంలో జరిగినవ్నీ చాలా దురదృష్టకరమైనవన్నారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి  ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే  పార్టీ ఫిరాయించిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement