నాందేడ్ ఎక్స్ప్రెస్ ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి చెప్పారు.
అనంతపురం : నాందేడ్ ఎక్స్ప్రెస్ ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి చెప్పారు. దుర్ఘటనపై కేంద్ర రైల్వే మంత్రికి సమాచారం అందించినట్లు ఆయన తెలిపారు. సంఘటనపై రైల్వే అధికారులు సమగ్ర విచారణ చేపట్టారని అనంత వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
మరోవైపు రైలు ప్రమాద దుర్ఘటనపై ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
క్షతగాత్రుల సమాచారం కోసం :
సికింద్రాబాద్ హెల్లైన్ నెంబర్లు: 040-27700868, 9701371060
వికారాబాద్ హెల్లైన్ నెంబర్లు : 08416-252215, 9701371081
ధర్మవరం హెల్లైన్ నెంబర్ : 08559 224422
గుంతకల్లు హెల్లైన్ నెంబర్లు : 0855 2220305, 09701374965
అనంతపురం హెల్లైన్ నెంబర్: 09491221390
సేదమ్ హెల్లైన్ నెంబర్: 08441-276066
బీదర్ హెల్లైన్ నెంబర్లు : 08482-226404, 7760998400
బెంగళూరు హెల్లైన్ నెంబర్లు : 080-22354108, 22259271
బెంగళూరు హెల్లైన్ నెంబర్లు: 080-22156554, 22156553
సత్యసాయి ప్రశాంతి నిలయం హెల్లైన్ నెంబర్ : 08555 280125