కొడుకు కోసం ఓ తల్లి మౌనదీక్ష | Mother started silence protest for Son at Chittoor | Sakshi
Sakshi News home page

కొడుకు కోసం ఓ తల్లి మౌనదీక్ష

Jun 15 2014 9:51 AM | Updated on Sep 2 2017 8:51 AM

తన కుమారుడ్ని అప్పగించాలని ఓ తల్లి మౌన దీక్ష చేపట్టింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని వి.కోటలో చోటు చేసుకుంది.

చిత్తూరు: తన కుమారుడ్ని అప్పగించాలని ఓ తల్లి మౌన దీక్ష చేపట్టింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని వి.కోటలో చోటు చేసుకుంది. మౌన దీక్ష చేపట్టిన ఉమామహేశ్వరి అనే గృహిణికి ఆమె భర్తకు మధ్య గత కొద్దికాలంగా విభేదాలు నెలకొన్నట్టు తెలిసింది. 
 
ఈ నేపథ్యంలో కుమారుడిని తండ్రి బలవంతంగా తీసుకెళ్లినట్టు సమాచారం. అయితే తన నాలుగేళ్ల కొడుకును తనకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఉమామహేశ్వరి దీక్ష చేపట్టింది. తన కుమారుడిని బలవంతంగా తీసుకెళ్లడంపై ఉమామహేశ్వరి అభ్యంతరం వ్యక్తం చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement