ఈ ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలి | Mother Fires On Government About B Tech Students Drown In Krishna River | Sakshi
Sakshi News home page

సెక్యురిటీ, హెచ్చరిక బోర్డులని ఎందుకు ఏర్పాటు చేయలేదు?

Jun 23 2018 9:54 PM | Updated on Jul 10 2019 2:44 PM

Mother Fires On Government About B Tech Students Drown In Krishna River - Sakshi

సాక్షి​, విజయవాడ : సంగమం ఘాట్‌ వద్ద నలుగురు బీటెక్‌ విద్యార్థులు గల్లంతైన ఘటన శనివారం చోటుచేసుకుంది. ఆ నలుగురు విద్యార్థుల్లో ఒకరైన ప్రవీణ్‌ (18) తల్లి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అక్కడ నలుగురు కానిస్టేబుళ్లను సెక్యురిటీగా పెడితే మా బాబు బతికే వాడని, ఘాట్‌ వద్ద సెక్యురిటీ, హెచ్చరిక బోర్డులని ఎందుకు ఏర్పాటు చేయలేదని పోలీసులను నిలదీశారు. ఏ ముహుర్తాన సంగమం ఘాట్‌ ఏర్పాటు చేశారో కానీ ఎంతో మంది బలైపోతున్నారని వాపోయారు. ఘటన జరిగిన తరువాత కాలేజీ యాజమాన్యం కూడా మాకు సమాచారం ఇవ్వలేదనీ, ఈ దుర్ఘటనకు కాలేజీ యాజమాన్యంతో పాటు, ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. గతంలో పడవ ప్రమాదం జరిగి 22మంది చనిపోయినా ప్రభుత్వం ఘాట్‌ వద్ద సెక్యురిటీని ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement