కృష్ణాజిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో దారుణం జరిగింది. గ్రామంలోని ఓ కుటుంబానికి చెందిన తల్లీకూతుళ్లను దుండగులు గత అర్థరాత్రి దారుణంగా నరికి చంపారు.
కృష్ణాజిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో దారుణం జరిగింది. గ్రామంలోని ఓ కుటుంబానికి చెందిన తల్లీకూతుళ్లను దుండగులు గత అర్థరాత్రి దారుణంగా నరికి చంపారు. ఆ ఘటనపై స్థానికులు గురువారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హుటాహుటిన సంఘటన మల్లవల్లి గ్రామానికి చేరుకున్నారు.
మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్యకు గల కారణాలపై పోలీసులు గ్రామస్థులను విచారిస్తున్నారు. దోపిడికి వచ్చిన వారే ఆ దారుణానికి పాల్పడి ఉంటారని గ్రామస్థులు పోలీసులకు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.