breaking news
Mother and Daughter killed
-
తల్లీకుమార్తె దారుణ హత్య
కర్ణాటక, బనశంకరి: తల్లీకుమార్తె హత్యకు గురైన ఘటన కొడగు జిల్లా సోమవారపేటే పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. కొడగు జిల్లా సోమవారపేటే దొడ్డమళ్తే గ్రామానికి చెందిన దివంగత వీరరాజు సతీమణి కవితా(45), ఆమె కుమార్తె జగశ్రీ(17)లు మంగళవారం ఉదయం తోటపనులకు వెళ్లారు. మధ్యాహ్నమైనా ఇంటికి రాకవడంతో కుమారుడు మేఘవర్దన్రాజ్ ఫోన్ చేయగా స్విచ్ఛాప్ అని వచ్చింది. దీంతో మేఘవర్దన్రాజ్ తోట వద్దకు వెళ్లగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది. మృతదేహాలపై ఉన్న బలమైన గాయాలను పరిశీలించగా దుండగులు మరణాయుధాలతో దాడిచేసి హత్య చేసినట్లు తేలింది జిల్లా ఎస్పీ సుమన్ డీ.పన్నేకర్, సోమవారపేటే డీఎస్పీ దినకర్శెట్టి, ఎస్ఐ నంజుండేగౌడ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. జాగీలాన్ని రప్పించి హంతకుల ఆనవాళ్ల కోసం ప్రయత్నించారు. నిపుణులు దుండగుల వేలిముద్రలు సేకరించారు. అనంతరం మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం కొడగు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా మృతురాలు కవితా కుటుంబానికి, అదే గ్రామంలోని కొందరితో భూతగాదాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఇదే విషయంపై గతంలో కూడా గొడవలు చోటుచేసుకున్నట్లు చెబుతున్నారు. మృతురాలు జగశ్రీ హసన్ సెయింట్ పెలోమినా కాలేజీలో ద్వితీయ పీయూసీ చదువుతోంది. సెలవులు కావడంతో ఊరికి వచ్చి తల్లితో సహా హత్యకు గురైంది. కుమారుడు మేఘవర్ధన్రాజ్ విరాజపేటే మొరార్జీదేశాయ్ స్కూల్ 8 వ తరగతి చదువుతూ హస్టల్లో ఉంటున్నారు. -
తల్లీకూతుళ్ల దారుణ హత్య
-
తల్లీకూతుళ్లను నరికి చంపిన దుండగులు
కృష్ణాజిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో దారుణం జరిగింది. గ్రామంలోని ఓ కుటుంబానికి చెందిన తల్లీకూతుళ్లను దుండగులు గత అర్థరాత్రి దారుణంగా నరికి చంపారు. ఆ ఘటనపై స్థానికులు గురువారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హుటాహుటిన సంఘటన మల్లవల్లి గ్రామానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్యకు గల కారణాలపై పోలీసులు గ్రామస్థులను విచారిస్తున్నారు. దోపిడికి వచ్చిన వారే ఆ దారుణానికి పాల్పడి ఉంటారని గ్రామస్థులు పోలీసులకు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.