‘వరదలతో బురద రాజకీయాలా?’

Mopidevi Venkataramana Rao Visits Prakasam Barrage  - Sakshi

సాక్షి, గుంటూరు : ఒకవైపు వరద వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే తెలుగుదేశం నాయకులు మాత్రం వరదలతో బురద రాజకీయాలు చేస్తున్నారని మంత్రి మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లోని వరద ప్రభావం ఉన్న లంక గ్రామాల్లో కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, ఎమ్మెల్యే మెరుగు నాగార్జునతో కలసి మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలుగుదేశం నాయకుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న చిల్లర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. వరద బాధితులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా పనిచేస్తున్నామని, ఏడు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ముంపు గ్రామాల ప్రజలను తరలిస్తున్నామని పేర్కొన్నారు. లంక గ్రామాల్లో నివాసం ఉంటున్న వారికి మంచినీరు ఆహార ప్యాకెట్లను పంపిస్తున్నాం. వరద తగ్గిన తర్వాత వచ్చే పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top