‘ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి’ | MLC Vitapu Balasubrahmanyam Speak At Media Point In The Assembly | Sakshi
Sakshi News home page

‘ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి’

Dec 13 2019 12:43 PM | Updated on Dec 13 2019 12:56 PM

MLC Vitapu Balasubrahmanyam Speak At Media Point In The Assembly - Sakshi

సాక్షి, అమరావతి: విశాఖ ఉక్కు​‍-ఆంధ్రుల హక్కు అని ఎమ్మెల్సీ విఠపు బాల సుబ్రహ్మణ్యం అన్నారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. బలి దానాలతో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ సాధించామని పేర్కొన్నారు. విశాఖ ఉక్కులో ఎవరి భాగస్వామ్యమూ అక్కరలేదన్నారు. విశాఖ ఉక్కులో దక్షిణ కొరియాకు చెందిన పోస్కో కంపెనీకి 1100 ఎకరాల భూమి ఇవ్వటం సరికాదన్నారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. కేంద్రం కుట్రపూరిత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శాసనమండలిలో తీర్మానం ప్రవేశపెడతామని చెప్పారు.  సోమ, మంగళ వారాల్లో  శాసనమండలిలో విశాఖ ఉక్కులో భూ కేటాయింపులపై చర్చిస్తామని వెల్లడించారు. తీర్మానం పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించటం అభినందనీయమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement