breaking news
MLC vithapu Balasubramanyam
-
‘ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి’
సాక్షి, అమరావతి: విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని ఎమ్మెల్సీ విఠపు బాల సుబ్రహ్మణ్యం అన్నారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ.. బలి దానాలతో విశాఖ స్టీల్‌ప్లాంట్ సాధించామని పేర్కొన్నారు. విశాఖ ఉక్కులో ఎవరి భాగస్వామ్యమూ అక్కరలేదన్నారు. విశాఖ ఉక్కులో దక్షిణ కొరియాకు చెందిన పోస్కో కంపెనీకి 1100 ఎకరాల భూమి ఇవ్వటం సరికాదన్నారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. కేంద్రం కుట్రపూరిత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శాసనమండలిలో తీర్మానం ప్రవేశపెడతామని చెప్పారు. సోమ, మంగళ వారాల్లో శాసనమండలిలో విశాఖ ఉక్కులో భూ కేటాయింపులపై చర్చిస్తామని వెల్లడించారు. తీర్మానం పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించటం అభినందనీయమన్నారు. -
అణు ప్లాంట్లను వ్యతిరేకించాలి
నెల్లూరు(అర్బన్): సమాజానికి పొంచి ఉన్న ముప్పును అరికట్టాలంటే ప్రమాదకరమైన అణు ప్లాంట్లను ప్రజలు వ్యతిరేకించాలని ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం విజ్ఞప్తి చేశారు. జనవిజ్ఞానవేదిక నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక బాలాజీనగర్‌లోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో మంగళవారం హిరోషిమా.. నాగసాకి డే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణుధార్మిక విస్పోటనం వల్ల కలిగే నష్టాలను వివరించారు. జనవిజ్ఞానవేదిక ఆరోగ్య సబ్‌కమిటీ జిల్లా కన్వీనర్ డాక్టర్ శ్రీనునాయక్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అణుధార్మికత వల్ల కలిగే నష్టాలను వివరించారు. కార్యక్రమంలో ఆ వేదిక నగర అధ్యక్ష, కార్యదర్శులు విద్యాచరణ్, మాదాల రాము, కోశాధికారి మోహన్‌రెడ్డి, నాయకులు విజయకుమార్, విజయ, ఆదిత్య కళాశాల కరస్పాండెంట్ ఆచార్య ఆదిత్య పాల్గొన్నారు. -
అంకెల గారడీ!
నూతన పాలకవర్గం ఏర్పడిన తర్వాత మొదటి బడ్జెట్ సమావేశం మంగళవారం నగర పాలక సంస్థ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా 2015-16 బడ్జెట్ రూ.610 కోట్లుగా ప్రవేశపెట్టారు. ప్రారంభ నిల్వను రూ.11.89 కోట్లుగా చూపారు. భూగర్భ డ్రైనేజీకి రూ.125 కోట్లు, తాగునీటికి రూ.100 కోట్లు, మరుగుదొడ్లకు రూ.10 కోట్లు, మాస్టర్‌ప్లాన్‌కు రూ.10 కోట్లు కేటాయించారు. పన్నులు రూపంలో రూ.26 కోట్లు, ఇతర జమలు రూ.112 కోట్లు, డిపాజిట్లు రూ.14 కోట్లు, గ్రాంట్లు రూ.444 కోట్లు వస్తుందని లెక్కల్లో చూపించారు. ఈ ఏడాది బీపీఎస్ రూపంలో కార్పొరేషన్‌కు రూ.60 కోట్లు వస్తుందని అంచనా వస్తున్నారు. నెల్లూరు, సిటీ: నగర పాలక సంస్థ 2015-16 బడ్జెట్ వాస్తవ దూరంగా, అంకెల గారడీలాగా ఉందని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం తదితరులు నిలదీశారు. అయితే మేయర్ ఏకపక్షంగా వ్వవహరిస్తూ ప్రతిపక్షం గొంతునొక్కే ప్రయత్నం చేశారు. నెల్లూరు కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం మంగళవారం మేయర్ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం ప్రారంభంకాగానే 12వ డివిజన్ కార్పొరేటర్ రంగ మయూర్‌రెడ్డి అధికారులు పన్నులు వసూలు చేస్తున్న తీరుపై ధ్వజమెత్తారు. ఈ విధంగా పన్నులు వసూళ్లు చేయడం దారుణమన్నారు. పోడియం వద్ద ఆందోళన చేశారు. ఆనం కారణంగానే అప్పులు: మేయర్ ఈ క్రమంలో టీడీపీ వర్గీయులకు, రంగమయూర్‌రెడ్డికి మధ్య వాగ్వాదం నెలకొంది. మేయర్ జోక్యం చేసుకుని ‘నీ కారణంగా, మీ నాన్న కారణంగానే ఈ పరిస్థితి నెలకొందన్నారు. మీ నాన్న పాలనలో చేసిన అక్రమాల కారణంగా కార్పొరేషన్ రూ.40 కోట్ల అప్పుల్లో మునిగిపోయిందన్నారు. మీ ఇంట్లో పనిచేసుకునేందుకు కూడా కార్పొరేషన్ ఉద్యోగులను వాడుకున్న సందర్బాలు ఉన్నాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.’ ఈ సందర్భంలో మంత్రి నారాయణ, మేయర్ అజీజ్‌పై రంగమమూర్రెడ్డి విమర్శలు గుప్పించారు. వెంటనే నూనె మల్లికార్జున్‌యాదవ్ కల్పించుకుని మంత్రిని విమర్శించే హక్కు నీకు లేదన్నారు. ఈక్రమంలో మేయర్, టీడీపీ సభ్యులు రంగమయూర్‌రెడ్డిని సమావేశం నుంచి వెళ్లిపోవాలని పదేపదే అనడం గమనార్హం. దీంతో అతను బడ్జెట్ కాగితాలను చించివేసి సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. అనంతరం కౌన్సిల్ సమావేశం యాథావిధిగా కొనసాగింది. పన్నులు వసూళ్లు, టోల్‌ప్లాజాపై ప్రస్తావన.. వైఎస్సార్సీపీ, మరికొందరు పన్నుల భారం, నగర పరిధిలో ఏర్పాటు చేయనున్న టోల్‌ప్లాజా నిర్మాణం గురించి తమ దృష్టికి తీసుకొచ్చారని మేయర్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. ప్రతిపక్ష సభ్యులు కోరినట్లు టోల్‌ప్లాజా నిర్మాణం అన్యాయమని, దీనికి కౌన్సిల్ ఆమోదం తెలపబోదని స్పష్టం చేశారు. ఇటీవల టోల్‌ప్లాజా నిర్మాణాన్ని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించడాన్ని గుర్తుచేశారు. గత ప్రభుత్వ తప్పిదాలే పునరావృతం: ద్వారకా ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్లో పేర్కొన్న లెక్కలు తప్పులతడకగా ఉన్నాయి.. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలే పునరావృతమవుతున్నట్లుగా ఉందని డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ అన్నారు. కౌన్సిల్ నిర్వహణ ఖర్చులు రూ.10లక్షలు చూపించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. చెట్ల పెంపకానికి, ఫాగింగ్, నిర్వహణ ఖర్చులు, వాహనాల మరమ్మతుల ఖర్చులు అత్యధికంగా చూపారన్నారు. వీధిదీపాలకు రూ.6.61కోట్లు లెక్కలు చూపించారని, అయితే ఎక్కడా ఖర్చుపెట్టిన సందర్భాలు లేవన్నారు. కార్పొరేటర్లే సొంత నిధులను ఖర్చుచేశారన్నారు. అయితే ఇంత భారీస్థాయిలో వీధి దీపాలకు ఖర్చుచూపించడంపై అధికారులు అవినీతికి పాల్పడినట్లుగా తెలుస్తుందన్నారు. ఉచ్చి భువనేశ్వరప్రసాద్, టీడీపీ కార్పొరేటర్ పంట కాలువల పూడికలు తీయడానికి రూ. 64 లక్షలు ఖర్చుపెట్టారన్నారు. ఎక్కడా పూడికలు తీసిన పరిస్థితి లేదన్నారు. ఎందుకు ఆలస్యంగా నిర్వహిస్తున్నారు ఏడాది చివరిరోజు బడ్జెట్ కౌన్సిల్ సమావేశం ఇంత ఆలస్యంగా ఎందుకుపెట్టారని వైఎస్సార్సీపీ విప్, బొబ్బొల శ్రీనివాసులు మేయర్‌ను నిలదీశారు. బడ్జెట్‌ను ఎప్పుడు సవరణ చేస్తారు, ప్రభుత్వానికి ఎప్పుడు పంపిస్తారన్నారు. అదేవిధంగా కొంతకాలం క్రితం మంత్రి నారాయణ మాట్లాడుతూ కార్పొరేట్ స్కూల్స్‌కు దీటుగా మున్సిపల్ స్కూల్స్‌ను అభివృద్ధి చేస్తానని హమీ ఇచ్చారని, అయితే ఈ బడ్జెట్‌ను గమనిస్తే రాబోయే కాలంలో విద్యార్థులకు ఇబ్బందులు తప్పవనే పరిస్థితి కనిపిస్తుందన్నారు. వైఎస్సార్సీపీ బాయ్‌కాట్ :రాబడికి, అభివృద్ధి పనుల నిర్వహణకు సంబంధించి వేసిన లెక్కల్లో పొంతనలేదని వైఎస్సార్సీపీ కౌన్సిల్ సభ్యులు ఆరోపించారు. ఈ బడ్జెట్‌ను తాము వ్యతిరేకిస్తున్నామని సమావేశం నుంచి బహిష్కరించి వెళ్లిపోయారు. అనంతరం ప్రతిపక్ష సభ్యుల ఆమోదం లేకనే బడ్జెకు మేయర్ పచ్చజెండా ఊపారు.