సీపీకి ఫిర్యాదు చేసిన వల్లభనేని వంశీ | MLA Vallabhaneni Vamsi Meets Vijayawada Police Commissioner | Sakshi
Sakshi News home page

విజయవాడ సీపీని కలిసిన ఎమ్మెల్యే వంశీ

Nov 15 2019 2:17 PM | Updated on Nov 15 2019 3:39 PM

MLA Vallabhaneni Vamsi Meets Vijayawada Police Commissioner - Sakshi

సాక్షి, విజయవాడ: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ శుక్రవారం విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావును కలిశారు. సోషల్‌ మీడియాలో తనపై వస్తున్న తప్పుడు ప్రచారంపై ఆయన సీపీకి ఫిర్యాదు చేశారు. తనను కించపరిచేలా ఆడపిల్లల పేర్లుతో ఫోటోలు మార్ఫింగ్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఎమ్మెల్యే వంశీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘టీడీపీ సోషల్‌ వింగ్‌ పేరుతో సర్క్యులేట్‌ చేసినట్లు మా దృష్టికి వచ‍్చింది. తన రాజకీయ భవిష్యత్‌ నాశనం చేయాలని కొందరు వ్యక్తులు మానవత్వం లేకుండా మా కుటుంబాన్ని కించపరుస్తున్నారు. అందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీపీని కోరాను. అటువంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హామీ ఇచ్చారు’ అని ఎమ్మెల్యే తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement