
ఆపరేషన్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వెంటనే డాక్టర్‌ను రప్పించాలని ఆదేశించారు. డాక్టర్ వచ్చే వరకు ఇక్కడే ఉంటానంటూ ఎమ్మెల్యే ఆస్పత్రిలోనే కూర్చున్నారు.
సాక్షి, విశాఖపట్నం : నర్సీపట్నంలోని ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్ల తీరుపై వైఎస్సార్‌సీపీ స్థానిక ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో సోమవారం ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సమయానికి అనస్థీషియా డాక్టర్ లేకపోవడంతో గర్భిణీలు ఇబ్బందులు పడుతున్నట్టు గమనించారు. దీంతో ఆపరేషన్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వెంటనే డాక్టర్‌ను రప్పించాలని ఆదేశించారు. దీంతో స్పందించిన యాజమాన్యం హుటాహుటిన చర్యలు ప్రారంభించింది. అనకాపల్లి నుంచి అనస్థీషియా డాక్టర్‌ను రప్పిస్తున్నట్టు వెల్లడించింది. అయితే, డాక్టర్ వచ్చే వరకు ఇక్కడే ఉంటానంటూ ఎమ్మెల్యే ఆస్పత్రిలోనే కూర్చున్నారు.