ప్రకాశం బ్యారేజిపై ఎమ్మెల్యే ఆర్కే బైఠాయింపు | MLA Ramakrishna reddy protests on prakasam barrage | Sakshi
Sakshi News home page

ప్రకాశం బ్యారేజిపై ఎమ్మెల్యే ఆర్కే బైఠాయింపు

May 15 2015 6:03 PM | Updated on May 29 2018 4:06 PM

ప్రకాశం బ్యారేజిపై ఎమ్మెల్యే ఆర్కే బైఠాయింపు - Sakshi

ప్రకాశం బ్యారేజిపై ఎమ్మెల్యే ఆర్కే బైఠాయింపు

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో బలవంతపు భూసేకరణ ఆపాలంటూ రైతులు ప్రకాశం బ్యారేజిపై నిరసనకు దిగారు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో బలవంతపు భూసేకరణ ఆపాలంటూ రైతులు ప్రకాశం బ్యారేజిపై నిరసనకు దిగారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ రైతులు కూరగాయలు, పండ్లు, పూలు ఉచితంగా పంపిణీ చేశారు.

రైతులకు సంఘీభావం తెలియజేస్తూ మంగళగిరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకాశం బ్యారేజి వద్ద బైఠాయించారు. ఈ ప్రాంతంలో భారీగా పోలీసులు బలగాల మోహరించారు. రాజధాని ప్రాంతంలో భూసేకరణ చట్టం ప్రయోగించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. పంట పొలాలను తాము ఇచ్చేదిలేదంటూ రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement