capital area farmers
-
సీఎం జగన్‌కు రాజధాని రైతుల కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి : రాజధాని ప్రాంత రైతులు మంగళవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. అసెంబ్లీ వద్ద సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన రైతులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి ప్రాంత రైతన్నలపై రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. గత సర్కారు హయాంలో రాజధాని నిర్మాణం కోసం 29 గ్రామాల రైతుల నుంచి భూములను సేకరించినప్పుడు ఇచ్చిన రాయితీలు, పరిహారం కంటే అధిక ప్రయోజనాలు కల్పిస్తామని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు అసెంబ్లీ వద్ద రాయలసీమ ప్రజాప్రతినిధులు కూడా సీఎం వైఎస్ జగన్‌ను కలిసి.. ఆయనతో కాసేపు ముచ్చటించారు. కాగా, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి గురించి ఆలోచించి.. సీఎం వైఎస్ జగన్ తీసుకొచ్చిన పాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుపై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: వాళ్లందరికీ వెంటనే ఈ పథకం వర్తింపజేస్తాం: సీఎం జగన్ ‘ఢిల్లీ కోటనే ఢీకొన్న నేత సీఎం జగన్’ టీడీపీది హీనమైన చరిత్ర : సీఎం జగన్ ఆంధ్ర రథం.. ప్రజా పథం -
ప్రకాశం బ్యారేజీ పై రైతుల ఆందోళన
-
ప్రకాశం బ్యారేజిపై ఎమ్మెల్యే ఆర్కే బైఠాయింపు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో బలవంతపు భూసేకరణ ఆపాలంటూ రైతులు ప్రకాశం బ్యారేజిపై నిరసనకు దిగారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ రైతులు కూరగాయలు, పండ్లు, పూలు ఉచితంగా పంపిణీ చేశారు. రైతులకు సంఘీభావం తెలియజేస్తూ మంగళగిరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకాశం బ్యారేజి వద్ద బైఠాయించారు. ఈ ప్రాంతంలో భారీగా పోలీసులు బలగాల మోహరించారు. రాజధాని ప్రాంతంలో భూసేకరణ చట్టం ప్రయోగించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. పంట పొలాలను తాము ఇచ్చేదిలేదంటూ రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. -
భూములు విక్రయించొద్దు: హైకోర్టు ఆదేశం
-
'మేం ఏం తినాలి గడ్డి తినాలా'
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరి
గడువు ముగిసిందంటూ 9.2 ఫారాలు తిరస్కరిస్తున్న అధికారులు అంగీకార పత్రాలకు మాత్రం గడువు పొడిగింపు అధికారుల ద్వంద్వ వైఖరిపై రైతుల ఆగ్రహం మంగళగిరి: రాజధాని ప్రతిపాదిత ప్రాం తంలో భూములివ్వడానికి సమ్మతించే రైతుల పట్ల ఒకలా.. సమ్మతించని రైతుల పట్ల మరోలా ప్రభుత్వం వ్యవహరిస్తోం ది. ల్యాండ్‌పూలింగ్‌కు భూములివ్వడానికి సమ్మతించే రైతుల నుంచి 9.3(అంగీకార) పత్రాలను తీసుకుంటున్న అధికారులు.. భూములిచ్చేందుకు సమ్మతించని రైతులనుంచి 9.2(అభ్యంతర) పత్రాలను స్వీకరించేందుకు మాత్రం తిరస్కరిస్తున్నారు. అభ్యంతరాలకు గడువు ముగిసిందంటున్న అధికారులు, అంగీకారపత్రాలకు మాత్రం మరో 15 రోజులు గడువు పొడిగించారంటూ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో గత నెల ఏడున నోటిఫికేషన్ జారీచేశారు. మంగళగిరి మండలంలోని కురగల్లు, నీరుకొండ, నవులూరు-1, నవులూరు-2 పరిధిలో ఈ నెల 7వ తేదీతో గడువు ముగిసినా భూసమీకరణలో అంగీకార పత్రాలు తీసుకుంటున్న అధికారులు శనివారం ఉదయం ఆకస్మికంగా 9.2 ఫారాలు తీసుకునేందుకు గడువు ముగిసిందని, తాము తీసుకోబోమంటూ తిరస్కరించారు. దీనిపై రైతులు ఆగ్రహం వెలిబుచ్చారు. అయినప్పటికీ భూసమీకరణ డిప్యూటీ కలెక్టర్లు నిబంధనల ప్రకారం తాము అంగీకారపత్రాలే తీసుకుంటామని, ఉన్నతాధికారులనుంచి ఆదేశాలు వచ్చేవరకు 9.2 ఫారాలు తీసుకోబోమని చెప్పడంపై రైతులు మండిపడుతున్నారు. 9.2 ఫారాలు తీసుకోవాల్సిందే: ఆర్కే రాజధాని భూసమీకరణ గ్రామాల్లో ఉన్నతాధికారుల ఆదేశాలు లేకపోయినా కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ రైతులనుంచి 9.2 ఫారాలు తీసుకోకుండా తిరస్కరించారని ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) మండిపడ్డారు. దీనిపై జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండేను సంప్రదించగా అలాంటిదేమీ లేదని, గడువు పెంపు అన్ని ఫారాలకూ వర్తిస్తుందని తెలిపినట్లు ఆయన వివరించారు. నియోజకవర్గంలో రాజధానికి భూమి ఇచ్చేందుకు ఇష్టంలేని రైతులు 9.2ఫారాలు అందజేయవచ్చని ఎమ్మెల్యే తెలిపారు.