ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరి | capital area farmers take on andhra pradesh government | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరి

Feb 8 2015 2:20 AM | Updated on Sep 2 2017 8:57 PM

రాజధాని ప్రతిపాదిత ప్రాం తంలో భూములివ్వడానికి సమ్మతించే రైతుల పట్ల ఒకలా.. సమ్మతించని రైతుల పట్ల మరోలా ప్రభుత్వం వ్యవహరిస్తోం ది.

 గడువు ముగిసిందంటూ 9.2 ఫారాలు తిరస్కరిస్తున్న అధికారులు
 అంగీకార పత్రాలకు మాత్రం గడువు పొడిగింపు
 అధికారుల ద్వంద్వ వైఖరిపై రైతుల ఆగ్రహం

 
 మంగళగిరి: రాజధాని ప్రతిపాదిత ప్రాం తంలో భూములివ్వడానికి సమ్మతించే రైతుల పట్ల ఒకలా.. సమ్మతించని రైతుల పట్ల మరోలా ప్రభుత్వం వ్యవహరిస్తోం ది. ల్యాండ్‌పూలింగ్‌కు భూములివ్వడానికి సమ్మతించే రైతుల నుంచి 9.3(అంగీకార) పత్రాలను తీసుకుంటున్న అధికారులు.. భూములిచ్చేందుకు సమ్మతించని రైతులనుంచి 9.2(అభ్యంతర) పత్రాలను స్వీకరించేందుకు మాత్రం తిరస్కరిస్తున్నారు. అభ్యంతరాలకు గడువు ముగిసిందంటున్న అధికారులు, అంగీకారపత్రాలకు మాత్రం మరో 15 రోజులు గడువు పొడిగించారంటూ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో గత నెల ఏడున నోటిఫికేషన్ జారీచేశారు. మంగళగిరి మండలంలోని కురగల్లు, నీరుకొండ, నవులూరు-1, నవులూరు-2 పరిధిలో ఈ నెల 7వ తేదీతో గడువు ముగిసినా భూసమీకరణలో అంగీకార పత్రాలు తీసుకుంటున్న అధికారులు శనివారం ఉదయం ఆకస్మికంగా 9.2 ఫారాలు తీసుకునేందుకు గడువు ముగిసిందని, తాము తీసుకోబోమంటూ తిరస్కరించారు. దీనిపై రైతులు ఆగ్రహం వెలిబుచ్చారు. అయినప్పటికీ భూసమీకరణ డిప్యూటీ కలెక్టర్లు నిబంధనల ప్రకారం తాము అంగీకారపత్రాలే తీసుకుంటామని, ఉన్నతాధికారులనుంచి ఆదేశాలు వచ్చేవరకు 9.2 ఫారాలు తీసుకోబోమని చెప్పడంపై రైతులు మండిపడుతున్నారు.
 
 9.2 ఫారాలు తీసుకోవాల్సిందే: ఆర్కే
 
 రాజధాని భూసమీకరణ గ్రామాల్లో ఉన్నతాధికారుల ఆదేశాలు లేకపోయినా కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ రైతులనుంచి 9.2 ఫారాలు తీసుకోకుండా తిరస్కరించారని ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) మండిపడ్డారు. దీనిపై జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండేను సంప్రదించగా అలాంటిదేమీ లేదని, గడువు పెంపు అన్ని ఫారాలకూ వర్తిస్తుందని తెలిపినట్లు ఆయన వివరించారు. నియోజకవర్గంలో రాజధానికి భూమి ఇచ్చేందుకు ఇష్టంలేని రైతులు 9.2ఫారాలు అందజేయవచ్చని ఎమ్మెల్యే తెలిపారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement