ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి పాదయాత్ర | mla padayatra | Sakshi
Sakshi News home page

Dec 15 2017 11:22 AM | Updated on Dec 15 2017 11:22 AM

కడప:గండికోట ప్రాజెక్టు నుంచి ఒక టీఎంసీ నీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి సర్వరాయసాగర్‌ నుంచి పాదయాత్ర చేపట్టారు. ఈయన పాదయాత్రకు కడప ఎమ్మెల్యే అంజాద్‌ బాషా, మేయర్‌ సురేష్‌బాబులు సంఘీభావం తెలిపారు. ప్రాజెక్టు నుంచి మూడు రోజులపాటు పాదయాత్ర కొనసాగనున్నది. ఇతర జిల్లాల్లో అన్ని పార్టీల నాయకులు నీళ్ల కోసం పోరాడుతుంటే ఇక్కడ మాత్రం అధికార పార్టీ నాయకులే అడ్డుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్ర ముగిసేలోగా నీటిని విడుదల చేయకపోతే కలెక్టరేట్‌ వద్ద నిరాహార దీక్ష చేపడతామని రవీంద్రనాథ్‌రెడ్డి హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement