‘పారిశుద్ద్య కార్మికుల కృషి వల్లే అది సాధ్యమయ్యింది’

MLA Bhumana Karunakar Reddy Feel Happy Tirupati Topped in Garbage Free City  Rankings - Sakshi

సాక్షి, తిరుపతి: తిరుపతి దేశంలో గార్బేజ్‌ ఫ్రీ సిటీగా దేశంలో గుర్తింపు పొందటం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు. బుధవారం తిరుపతిలో భూమన మాట్లాడుతూ...దేశవ్యాప్తంగా త్రిబుల్ స్టార్స్ లో తిరుపతికి మొదటి ర్యాంకు రావడం మంచి పరిణామన్నారు. ఇందు కోసం మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు, సిబ్బంది ఎంతో కష్టపడ్డారని, పారిశుధ్య కార్మికులు చేసిన కృషి చాలా గొప్పదని భూమన కరుణాకర్‌ రెడ్డి కొనియాడారు. ఆధ్యాత్మిక నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చి దిద్దారని భూమన అన్నారు. (త్రీస్టార్.. తిరుపతి వన్)

ఇదే విషయం గురించి తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్‌ గిరిష మాట్లాడుతూ... గార్బేజ్‌ ఫ్రీ‌ సిటీగా దేశవ్యాప్తంగా త్రిబుల్‌ స్టార్స్‌లో తిరుపతి మొదటిస్థానం రావడం చాలా గర్వంగా ఉందన్నారు. దీని కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. దీనిని సాధించడంలో తిరుపతి ప్రజల సహకారం మరువలేనిదని, ఎ‍మ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి ఈ విషయంలో చాలా సహకరించారని కొనియాడారు. (విజయవాడ చేరుకున్న 156 మంది ప్రవాసాంధ్రులు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top