ప్రజల అభీష్టం మేరకే రాజీనామాలు: కొండ్రు | ministers Kondru murali, Satrucharla vijaya ramaraju quits to protest state's division | Sakshi
Sakshi News home page

ప్రజల అభీష్టం మేరకే రాజీనామాలు: కొండ్రు

Aug 12 2013 1:34 PM | Updated on Sep 1 2017 9:48 PM

ప్రజల అభీష్టం మేరకే రాజీనామాలు: కొండ్రు

ప్రజల అభీష్టం మేరకే రాజీనామాలు: కొండ్రు

సమైక్యాంధ్రకు మద్దతుగా మంత్రులు కొండ్రు మురళి, శత్రుచర్ల విజయరామరాజు తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు.

హైదరాబాద్ : సమైక్యాంధ్రకు మద్దతుగా మరో ఇద్దరు మంత్రులు రాజీనామాలు చేశారు. మంత్రులు కొండ్రు మురళి, శత్రుచర్ల విజయరామరాజు సోమవారం తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. ఈమేరకు వారు ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిని కలిసి తమ రాజీనామా పత్రాలు సమర్పించారు.

ప్రజాభీష్టం మేరకే తాము పదవులకు రాజీనామాలు చేసినట్లు కొండ్రు మురళి తెలిపారు. రాష్ట్ర విభజనపై సీపీఐ, బీజేపీ, టీడీపీ తమ నిర్ణయాన్ని మార్చుకుంటే.... కాంగ్రెస్ నిర్ణయాన్ని మార్చుకునేలా చేస్తామని కొండ్రు మురళి అన్నారు. ఇప్పటికే సగం మంది సీమాంధ్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

కాగా రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం తొలిసారి సచివాలయానికి వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డికి సమైక్య సెగ తగలింది. సీమాంధ్ర ఉద్యోగులు కళ్లకు గంతలు కట్టుకుని తమ నిరసన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement