దశాబ్దాల ప్రజల కలను నిజం చేస్తాం..

Ministers Anil And Goutham Reddy Release Of Water From Somasila Reservoir - Sakshi

పరిశ్రమలు, వాణిజ్య, ఐటి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి

సాక్షి, నెల్లూరు: సోమశిల హైలెవల్ కెనాల్ రెండో ఫేజ్ పనులు త్వరలోనే పూర్తి  చేసి.. దశాబ్దాల ప్రజల కలను నిజం చేస్తామని పరిశ్రమలు, వాణిజ్య, ఐటి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో వానలు లేవు.. నీళ్లు లేవని.. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే ప్రాజెక్టులన్నీ నీటితో కళకళలాడుతున్నాయన్నారు. జలవనరుల శాఖ మంత్రిగా మన జిల్లాకు చెందిన అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఉండటం సంతోషకరమన్నారు.

సోమశిల నుంచి నీటిని విడుదల చేసిన మంత్రులు..
సోమశిల జలాశయం నుంచి కండలేరు జలాశయానికి మంత్రులు అనిల్‌కుమార్‌ యాదవ్‌, మేకపాటి గౌతమ్‌ రెడ్డి మంగళవారం నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, వర ప్రసాదరావు, జిల్లా కలెక్టర్‌ శేషగిరి బాబు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top