సింగపూర్‌కు మంత్రి నారాయణ | Minister Narayana to Singapore | Sakshi
Sakshi News home page

సింగపూర్‌కు మంత్రి నారాయణ

Sep 4 2016 1:51 AM | Updated on May 29 2019 3:19 PM

సింగపూర్‌కు మంత్రి నారాయణ - Sakshi

సింగపూర్‌కు మంత్రి నారాయణ

పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ రెండ్రోజుల పర్యటనకు సింగపూర్ వెళుతున్నారు.

సాక్షి, హైదరాబాద్: పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ రెండ్రోజుల పర్యటనకు సింగపూర్ వెళుతున్నారు. ఈమేరకు సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఈనెల 4, 5 తేదీల్లో  ఆయన సింగపూర్‌లో అధికారిక సమావేశాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.

విదేశీ ప్రతినిధులతో సాధారణ సమావేశంలో పాల్గొనడానికి వెళుతున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే.. తాజాగా స్విస్ చాలెంజ్ పద్ధతిలో రాజధాని నిర్మాణంపై హైకోర్టులో వ్యాజ్యాలు వేయడం, దీనిపై తీవ్ర వివాదం నేపథ్యంలో నారాయణ సింగపూర్ పర్యటన ఆసక్తికరంగా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement