
సాక్షి, విశాఖపట్నం: ఏపీని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ఆదివారం పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఆహ్లాదకర వాతావరణంలో జరుగుతున్న భీమిలి ఉత్సవాల్లో ఆయన మాట్లాడుతూ.. భీమిలి ఖ్యాతిని ప్రపంచపటంలో నిలిచేలా అభివృద్ధి చేస్తామన్నారు. 13 జిల్లాల్లో అంతర్జాతీయ స్థాయి రిసార్ట్స్‌ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వీఎంఆర్‌డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ.. విశాఖ పర్యాటక శాఖ ‘భీమిలి చరిత్ర’ను మరోసారి ప్రపంచానికి తెలియచెప్పిందన్నారు. సినిమారంగ అభివృద్ధికి భీమిలి కేంద్రంగా ఉందన్నారు. వంపులు తిరిగిన సముద్రం భీమిలి అందాలకు ప్రత్యేకత అని తెలిపారు. ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్‌పర్సన్ రోజా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సైరా.. అన్నట్టుందని, నాకు సినిమా కెరీర్ ఇచ్చిన ‘చామంతి’ చిత్రం షూటింగ్ ఇక్కడే చేశామని పేర్కొన్నారు. భీమిలి మంత్రిగా గంటా దోచుకుంటే.. ఇప్పటి మంత్రి అవంతి శ్రీనివాస్ అభివృద్ధి చేస్తున్నారని ఎమ్మెల్యే రోజా తెలిపారు.