మాకు తీట పట్టి వచ్చామా.. | Minister Adinarayana Reddy inappropriate comments on women's | Sakshi
Sakshi News home page

మాకు తీట పట్టి వచ్చామా..

Aug 27 2017 3:59 AM | Updated on Aug 10 2018 9:42 PM

మంత్రి మాట్లాడుతుండగా సమావేశం నుంచి వెళ్లే ప్రయత్నం చేస్తున్న మహిళలు - Sakshi

మంత్రి మాట్లాడుతుండగా సమావేశం నుంచి వెళ్లే ప్రయత్నం చేస్తున్న మహిళలు

రాష్ట్ర మంత్రి ఆదినారాయణరెడ్డి తన నోటి దురుసుతనాన్ని మరోమారు మహిళలపై చూపెట్టారు.

మహిళలపై మంత్రి ఆదినారాయణరెడ్డి అనుచిత వ్యాఖ్యలు 
 
ప్రొద్దుటూరు టౌన్‌: రాష్ట్ర మంత్రి ఆదినారాయణరెడ్డి తన నోటి దురుసుతనాన్ని మరోమారు మహిళలపై చూపెట్టారు. వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్‌ కార్యాలయ ఆవరణ లో శనివారం హౌసిం గ్‌ ఫర్‌ ఆల్‌ స్కీం గృహ నిర్మాణాలకు మంత్రి భూమిపూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతుండగా డ్వాక్రా మహిళలు లేచి వెళ్లిపోవడం ప్రారంభించారు. సహనం కోల్పోయిన మంత్రి మహిళలను ఉద్దేశించి  ‘‘మాకేమైనా తీట పట్టి వచ్చామా.. కూర్చునే ఓపిక కూడా లేదా? అన్ని పథకాలు కావాలంటారే’’ అని మండిపడ్డారు. ‘‘ఇది మాకు కూడా భోజనం సమయమే.

మాకు ఆకలవుతోంది.. అందరూ వచ్చి కూర్చోండి’’ అని అనడంతో మహిళలు తిరిగి వచ్చి సీట్లలో కూర్చున్నారు. మంత్రి దురుసుగా మాట్లాడటంపై డ్వాక్రా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి, తమకు ఎలాంటి సంబంధం లేకపోయినా, మెప్మా సీఓలు, ఆర్పీలు బలవంతంగా ఉదయం తమను పిలుచుకొచ్చారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం కావస్తోందని, తమ పిల్లలకు భోజనం పెట్టడానికిఇంటికి వెళతామంటే సీఓలు అడ్డుకున్నట్లు తెలిపారు. కాగా, మంత్రి మహిళలను కించపరుస్తూ మాట్లాడినప్పుడు వేదికపై ఉన్న టీడీపీ నాయకులు ముసిముసి నవ్వులు నవ్వుకోవడం గమనార్హం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement