'విశాఖ కేంద్రంగా 50వేల ఐటీ ఉద్యోగాలు'

Mekapati Goutham Reddy Comments About Industrial Development In Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం : పరిశ్రమల మధ్య ఉన్న వ్యత్యాసం, అంతరాన్ని తొలగించి అనుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌ రెడ్డి పేర్కొన్నారు. కొత్త పరిశ్రమల పాలసీ అనేది సింపుల్‌గా, పారదర్శకంగా, సెల్ఫ్‌ పోలీసింగ్‌ పాలసీగా ఉంటుందని తెలిపారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి పరిశ్రమల రాయితీ కింద 4600 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండేదని, త్వరలోనే వాటిని క్లియర్‌ చేస్తామని మేకపాటి గౌతమ్‌ రెడ్డి స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో జరిగిన సమావేశంలో ఈ ఏడాది విశాఖ కేంద్రంగా 50 వేల ఐటీ ఉద్యోగాలు, ఒక స్కిల్‌ యునివర్సిటీ, 26 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు, 4 కాలేజ్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా మంత్రి వెల్లడించారు. కాగా వీటి ఏర్పాటుకు 4 పారామీటర్లలో అధ్యయనం చేసి 45 నివేదిక ఇవ్వాలని సీఎం సూచించినట్లు పేర్కొన్నారు. అయితే స్కిల్‌ యునివర్సిటీ ఏర్పాటుకు ఆర్థిక వనరుల లభ్యత, అనుకూల ప్రాంతం, కరిక్యలమ్‌ ఏ విధంగా ఉండాలనేదానిపై ముఖ్యమంత్రిని అడిగినట్లు పేర్కొన్నారు. నాడు-నేడులో భాగంగా ప్రభుత్వ ఐటీఐ, పాలిటెక్నిక్‌ కళాశాలలను కూడా భాగస్వామ్యం చేయాలని, దానివల్ల అవి మరింత అప్‌గ్రేడ్‌ అయ్యే అవకాశముందని సీఎంను వివరించినట్లు తెలిపారు.
(పరిశ్రమలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది)

అదాని డేటా సెంటర్ ను మార్చమని ప్రభుత్వం ఎక్కడ చెప్పలేదని, వాస్తవంగా డేటా సెంటర్లు చాలా అవసరం అన్నారు.  కానీ డేటా సెంటర్ లొకేషన్ మార్పు పై సోషల్ మీడియాలో అనవసరంగా దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమని గౌతమ్‌ రెడ్డి తెలిపారు. సచివాలయం పేరిట ఐటీ కంపెనీలను వెళ్లిపోవాలని,  ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని, ఐటీ కంపెనీలను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తుంటే, ఉన్న కంపెనీలను ఎలా బయటకు పంపిస్తామని పేర్కొన్నారు.  చంద్రబాబు ఐటీ కంపెనీలపై చేస్తున్న అనవసర ప్రచారాలు మానుకుంటే మంచిదని గౌతమ్‌ రెడ్డి హితభోద చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top