వైద్యసేవలు మెరుగుపడాలి | medical treatment should be improve | Sakshi
Sakshi News home page

వైద్యసేవలు మెరుగుపడాలి

Nov 11 2013 3:16 AM | Updated on Oct 8 2018 5:04 PM

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు అందించే వైద్యసేవలు మరింత మెరుగుపడాలని, మహిళలు మాత్రమే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకోకుండా పురుషులు కూడా వెసక్టమీ ఆపరేషన్లు చేయించుకోవాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ తేజోరాం కోరారు.

ఉప్పునుంతల/అచ్చంపేట, న్యూస్‌లైన్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు అందించే వైద్యసేవలు మరింత మెరుగుపడాలని, మహిళలు మాత్రమే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకోకుండా పురుషులు కూడా వెసక్టమీ ఆపరేషన్లు చేయించుకోవాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ తేజోరాం కోరారు. కరీంనగర్, ఖమ్మం జిల్లాలో గత 30 ఏళ్లుగా పురుషులు అధికంగా వెసక్టమీ ఆపరేషన్లు చేయించుకుంటున్నారని వివరించారు. ఈ ఆపరేషన్లపై ఉన్న అపోహలను తొలగించేందుకు జిల్లాలో అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని జిల్లా వైద్యాధికారిణి రుక్మిణమ్మకు సూచిం చారు. మంత్రిత్వశాఖ అధికారుల బృందం ఆ దివారం నల్లమలలోని ఉప్పునుంతల పీహెచ్ సీ, అచ్చంపేట సివిల్ ఆస్పత్రిని సందర్శించింది.
 
 ఇక్కడ ప్రజలకు అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ బృందంలో డాక్టర్ వెంకటేష్ శ్రీనివాసన్(యూఎన్‌ఎఫ్‌పీఏ), డా క్టర్ అనామికా సక్సేనా ట్రైనింగ్ డివిజన్ ఇన్‌చా ర్జి), డాక్టర్ రితేష్ (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం ప్రతినిధి) లు ఉన్నారు. బృందం సభ్యులు ముందుగా ఉప్పునుంతల పీహెచ్‌సీలోని లేబర్‌రూం, బేబీ వామర్, ఫార్మసీ రూం, వ్యాక్సిన్ భద్రపర్చుగది, ల్యాబ్‌ను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో నమోదవుతున్న ఓపీ, నెలలో జరుగుతున్న డెలివరీలను డాక్డర్ రజనీని అడిగి తెలుసుకున్నారు. లేబర్ రూంలో డెలివరీ నుంచి తల్లిబిడ్డలను ఆస్పత్రి నుంచి ఇంటికి పంపించే వరకు అందుతున్న వైద్యసేవలను వైద్యులు, సిబ్బందిని అడిగారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ..కాన్పు అయిన 48 గంటల వరకు తప్పకుండా తల్లిబిడ్డలను ఆస్పత్రిలోనే ఉంచాలని వైద్యసిబ్బందికి సూచించారు.

ఆస్పత్రుల్లోనే కాన్పులు అయ్యే విధంగా చూడాలన్నారు. కాన్పు, కాన్పుకు ఎడం ఉండాలన్న విషయమై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. కుటుంబ నియంత్రణ కోసం కేవలం ఆపరేషన్లే కాకుండా పదేళ్ల వరకు గర్భం దాల్చకుండా పనిచేసే ఐయూడీ లూబ్స్ అందుబాటులోకి వచ్చాయన్నారు. నేషనల్ రూరల్‌హెల్త్ మిషన్(ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) నిధుల వినియోగం, పథకాల అమలుపై ఏడాదికొకసారి నిర్వహించే కామన్ రివ్యూమిషన్‌లో భాగంగా రాష్ట్రంలో రెండు బృందాలుగా ఏర్పడి మహబూబ్‌నగర్, చిత్తూరు జిల్లాల్లో ఈనెల 14వరకు ఆస్పత్రులను తనిఖీలు చేయనున్నట్లు తెలిపారు.
 
 అచ్చంపేట ఆస్పత్రిస్థాయి పెంపు
 అచ్చంపేట సివిల్ ఆస్పత్రిస్థాయి పెంచే అలోచన ఉందని డిప్యూటీ కమిషనర్ డాక్టర్ తేజరాం అన్నారు. ఆస్పత్రిలో అన్ని వసతులు బాగున్నాయని, అవసరమైతే అన్ని వసతులతో కూడిన ఏరియా ఆస్పత్రిగా రూపాంతరం చెందే అవకాశం ఉందని ప్రభత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.
 
 ఆపరేషన్ థియేటర్, రక్తనిధి కేంద్రం, ఎక్స్‌రే సెంటర్, ల్యాబ్, నిధులు, ఖర్చుల నివేదిక ఆస్పత్రి పనితీరు బాగుందన్నారు.కేంద్ర బృందం వెంట ప్లానింగ్, మెటర్నటీ, చైల్డ్‌హెల్త్ రాష్ట్ర అదనపు సంచాలకులు డాక్టరు నీరద, కుటుంబ నియంత్రణ రాష్ట్ర సంయుక్త సంచాలకులు డాక్టర్ జయకుమారి, వైద్యవిధాన పరిషత్ రాష్ట్ర సంయుక్త సంచాలకులు డాక్టర్ గాయిత్రీ, డీఐఓ జనార్దన్, ఎంహెచ్‌ఎన్ జేడీ డాక్టర్ జనార్దన్, జిల్లా మలేరియా అధికారి డాక్డర్ శశికాంత్, జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఎయిడ్స్, కుష్టురోగ నివారణ అధికారి డాక్టర్ శ్రీధర్‌రెడ్డి, ఎస్‌పీహెచ్‌ఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement