ముద్ద.. ముద్దకో.. ముక్క! 

Meat Consumption In West godavari Is Growing - Sakshi

ముక్క లేనిదే ముద్ద దిగట్లేదు 

జిల్లాలో పెరిగిన మాంసం వినియోగం 

రోజుకు లక్షల కిలోల్లో అమ్మకాలు 

కోడి మాంసానిదే అగ్రతాంబూలం 

ము..ము..ము.. ముక్కంటే మోజు.. ముద్దల్లో ముక్కే రోజూ.. అంటున్నారు మాంసప్రియులు.. రోజులతో సంబంధం లేదు.. వారం.. వర్జ్యంతో పనిలేదు.. కిలోలకు కిలోలు లాగించేస్తున్నారు. కనీసం ఇద్దరిలో ఒక్కరికి వారంలో ఒక్కసారైనా నీసు కూర ఉండాల్సిందే.. ఆదివారం వచ్చిందంటే చాలా మంది ఇళ్లల్లో మసాలా వాసన రావాల్సిందే!  వంటల మెనూలో నీసు కూర లేకపోతే ఆ రోజుకు స్పెషల్‌ లుక్‌ రాదనే చెప్పాలి. అయితే మారుతున్న కాలంలో.. ప్రతిరోజూ స్పెషల్‌గానే మారింది. ఎవరి స్థోమతను బట్టి వాళ్లు చికెన్, మటన్‌ వంటకాలతో ముద్ద లాగించేస్తున్నారు. జిల్లాలో ఆదివారం నాడు సుమారు 3 లక్షల కిలోలకు పైగా మాంస విక్రయాలు జరుగుతున్నాయి. వీటికోసం జిల్లావాసులు సుమారు రూ.8.50 కోట్లకు పైగా వెచ్చిస్తున్నారు. 

సాక్షి, తాడేపల్లిగూడెం: జిల్లాలో మాంసం వినియోగం భారీగా పెరుగుతోంది. మేక, గొ ర్రె, కోడి, కవుజు పిట్టల అమ్మకాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. జిల్లాలో ప్రధాన మేకల సంత పెదతాడేపల్లికి వా రానికి 5,000 మేకలు, గొర్రెలు వస్తుండ గా హాట్‌కేక్‌లుగా అమ్ముడవుతున్నాయి. జిల్లాలో ఆదివారం మేక, గొర్రెల మాంసం వినియోగం సుమారు 50 వేల కిలోల వరకు ఉన్నట్టు అంచనా. ప్రస్తుతం జిల్లాలో బోన్‌ మటన్‌ ధర కిలో రూ.660, బోన్‌సెల్‌ రూ.750 నుంచి 800 వరకు ధర ఉంది.

మేక మాంసం దుకాణం

ప్రధానంలో జిల్లాలో మాంస వినియోగానికి కావాల్సిన మేకలు, గొర్రెలను వ్యాపారులు తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి మేకల సంతలో కొనుగోలు చేస్తారు. వారంలో రెండు రో జులపాటు జరిగే ఈ సంతలో మాంసం కోసం 5,000 వరకు మేకలు, గొర్రెల అమ్మకాలు జరుగుతున్నాయి. ఇవికాకుండా మొక్కుబడుల కోసం కొనుగోలు చేసే జీవాలు 500 నుంచి 1,000 వరకు ఉంటాయని అంచనా. వేట మాంసం ధరలు పెరిగినా కొనేందుకు మాత్రం వినియోగదారులు వెనుకడుగు వేయడం లేదు.
 
చికెన్‌.. వినియోగం పెరిగెన్‌ 
చికెన్‌ కంపెనీల గుత్తాధిపత్యంతో కోడిమాంసం ధరలు విపరీతంగా పెరిగాయి. జిల్లాలో మాంసం, గుడ్ల కోసం కోళ్లను పెంచే ఫారాలు సుమారు 250 వరకు ఉన్నాయి. వీటిలో సుమారు 1.80 లక్షల బ్రాయిలర్‌ కోళ్లు పెరుగుతున్నాయి. మిగిలినవి లేయర్‌ కోళ్లు. ఇటీవల కాలంలో కోడి మాంసానికి డిమాండ్‌ పెరిగింది. లైవ్, స్కిన్, స్కిన్‌లెస్‌ పేరిట కోడి మాంసం వినియోగం జరుగుతోంది.

జిల్లాలో రోజుకు 2.50 లక్షల కిలోల కోడి మాంసం వినియో గం జరుగుతున్నట్టు అంచనా. లెగ్‌ పీసులు తినే సంస్కృతి విస్తరిస్తోంది. కోడి పకోడికి క్రేజ్‌ పెరిగింది. బ్రాయిలర్, లేయర్‌ కోళ్ల ఫారాలతో పాటు నా టు కోళ్ల ఫారాలు విస్తరిస్తున్నాయి. నా టుకోళ్ల మాంసం వినియోగం కూడా పెరగడం కారణంగా కనిపిస్తోంది. నా టు కోడి మాంసం కిలో రూ.500 వరకు పలుకుతోంది. దీంతోపాటు కముజు పిట్టల మాంసం వినియోగం కూడా పెరిగింది. పిట్ట ఒకటి రూ.40 వరకు ధర ఉంది. కిలో ధర రూ.400 వరకు పలుకుతుంది. వీటి మాంసం వినియోగం రోజుకు రెండు వేల కిలోల వరకూ ఉంది.
 
రూ.8.50 కోట్ల వరకూ ఖర్చు 
వేట, కోడి, కముజు పిట్ట మాంసంపై జిల్లావాసులు రోజుకు రూ.8.50 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. రోజుకు 50 వేల కిలోల వేట మాంసం వినియోగం ఉంటే సగటున కిలో రూ.660 ధర ఉ న్నా రూ.3.30 కోట్లు అవుతుంది. కోడి మాంసం వినియోగం రోజుకు 2.50 లక్షల కిలోలు ఉంటే కిలో రూ.200 లెక్కన రూ.5 కోట్లు, కముజు పిట్టల వినియోగం 2 వేల కిలోలు ఉంటే కిలో రూ.400 లెక్కన రూ.8 లక్షలు ఖర్చు చేస్తున్నారు. మొత్తంగా రూ. 8.50 కోట్ల వరకూ మాంసప్రియులు వెచ్చిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top