తాళికట్టు శుభవేళ..! | Mass weddings In Kurnool | Sakshi
Sakshi News home page

తాళికట్టు శుభవేళ..!

May 21 2018 10:57 AM | Updated on May 21 2018 10:57 AM

Mass weddings In Kurnool - Sakshi

వివాహాలు చేసుకుంటున్న వధూవరులు

 కర్నూలు, హొళగుంద: స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల వేదికగా ఆదివారం సామూహిక వివాహ కార్యక్రమం వైభవంగా సాగింది. స్వేరోస్‌ నెట్‌వర్క్, హార్డ్స్, భారత్‌యూత్‌ అసోసియేషన్‌ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు  దుర్గాప్రసాద్, చలపతి, కన్నారావు, రవికాంత్, వైఎస్సార్‌సీపీ నాయకుడు హోటల్‌ తిమ్మయ్య, సీపీఐ మండల సహాయ కార్యదర్శి మారెప్ప ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 15 జంటలు తాళిబంధం ద్వారా ఒక్కటయ్యాయి. పురోహితుడు నటరాజస్వామి వేద మంత్రాల మధ్య వధూవరులు పెళ్లి చేసుకున్నారు.

స్వేరోస్‌ వ్యవస్థాపకుడు, తెలంగాణ ఐజీ ప్రవీణ్‌కుమార్, మాజీ మంత్రి మూలింటి మారెప్ప, రిటైర్డు ఐఏఎస్‌ అధికారి శ్రీనివాసులు, ఐఏఎస్‌ అధికారి అనిల్‌కుమార్, కర్నూలు డీఎస్పీ బోయగడ్డ రామయ్య, తిరుపతి సీనియర్‌  సివిల్‌ జడ్జి రామచంద్రుడు తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మండలానికి చెందిన పెద్దలు, ఎల్లార్తి దర్గాల మాజీ నిర్వాహకుడు మల్లికార్జున, బీజేపీ స్టే కౌన్సిల్‌ సభ్యుడు చిదానంద, తోక వెంకటేశ్, దురుగప్ప, హెబ్బటం పక్కీరప్ప, గుబ్బళ్లీ లక్ష్మయ్య తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement