అమరజీవి త్యాగం మరువలేనిది | Martyr sacrifice ysrcp leader kuppam prasad | Sakshi
Sakshi News home page

అమరజీవి త్యాగం మరువలేనిది

Mar 17 2014 5:10 AM | Updated on May 29 2018 4:09 PM

అమరజీవి త్యాగం మరువలేనిది - Sakshi

అమరజీవి త్యాగం మరువలేనిది

అమరజీవి పొట్టిశ్రీరాములు త్యాగం మరువలేనిదని వైఎస్‌ఆర్ సీపీ నగర పార్టీ అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ అన్నారు.

 వెఎస్‌ఆర్ సీపీ నగర పార్టీ అధ్యక్షుడు కుప్పం ప్రసాద్
 
 ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్: అమరజీవి పొట్టిశ్రీరాములు త్యాగం మరువలేనిదని వైఎస్‌ఆర్ సీపీ నగర పార్టీ అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ అన్నారు. అమరజీవి పొట్టిశ్రీరాములు జయంతిని పురస్కరించుకుని వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కుప్పం ప్రసాద్ పాల్గొన్నారు.
 
 ఈ సందర్భంగా తొలుత స్థానిక తాతా బిల్డింగ్స్ సమీపంలోని పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం క్లబ్ కార్యదర్శి పవన్‌కుమార్‌తో కలిసి మాతా శిశు వైద్యశాలలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి దేసు వెంకటసుబ్బారావు, వేములు శ్రీమనారాయణ తదితరులు పాల్గొన్నారు.
 
 బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ ఆధ్వర్యంలో..
 పొట్టిశ్రీరాములు జయంతిని పురస్కరించుకుని బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కాంప్లెక్స్‌లోని పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
 
 కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు తాతా వెంకట చెంచయ్య గుప్తా, కార్యదర్శి ఇస్కాల వేణుగోపాల్, మాజీ కార్యదర్శి కూరపాటి సత్యనారాయణ, క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తూను గుంట రామమోహనరావు తదితరులు పాల్గొన్నారు.
 
 
 ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో..

 జిల్లా ఆర్యవైశ్య సంఘం  ఆధ్వర్యంలో పొట్టిశ్రీరాములుజయంతి వేడుకలను స్థానిక వైశ్యాభవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు పెరుమాళ్ల కాశీరావు మాట్లాడుతూ అమరజీవి త్యాగాన్ని కొనియాడారు.
 
 కార్యక్రమంలో సంఘం మాజీ అధ్యక్షుడు తాతా సుబ్బారావు, కోశాధికారి గ్రంధె వెంకటరామభద్రారావు, ఉపాధ్యక్షుడు బాబు, పెరుమాళ్ల గిరి, కార్యదర్శి నరసింహారావు, మండల అధ్యక్షుడు మోదుకూరి శ్రీనివాసరావు, పబ్బిశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement