వివాహిత ఆత్మహత్య

Married Woman Commits Suicide - Sakshi

విశాఖపట్నం, గొలుగొండ: తండ్రి మందలించాడని మనస్తాపానికి గురైన వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. చోద్యం గ్రామంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి కృష్ణదేవిపేట ఎస్‌ఐ రమేష్‌ అందించిన వివరాలిలావున్నాయి. చోద్యం గ్రామానికి చెందిన శ్రీపాద అనూష(24) గత ఏడాది శ్రీపాద సత్యన్నారాయణతో వివాహం అయ్యింది. భర్తతో పాటు అనూష తల్లిదండ్రులు చోద్యంలో నివాసం ఉంటున్నారు. అనూష తండ్రి కామేశ్వర శర్మ ఇంట్లోని చెవిదుద్దులు తీసుకువెళ్లారు.

వాటిని తిరిగి తీసుకురాకపోవడంతో  అనూషకు ఆయనకు మధ్య గొడవ జరిగింది.  కాసేపటికి అంతా సద్దుమణిగింది. తరువాత అర్ధరాత్రి సమయంలో అనూష ఇంట్లో ఉన్న కిరోసిన్‌ ఒంటిపై వేసుకొని నిప్పంటుచుకుని ఆత్మహత్యకు పాల్పడింది.కుటుంబ సభ్యులు మంటలు అర్పినా ప్రయోజనం లేకపోయింది.  శరీరం కాలిపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనూష భర్త  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top