నరసాపురం-పాలకొల్లు రోడ్డులో మత్స్యపురి వంతెన, కనకదుర్గ ఆలయం సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కృష్ణాజిల్లా
నరసాపురం అర్బన్ : నరసాపురం-పాలకొల్లు రోడ్డులో మత్స్యపురి వంతెన, కనకదుర్గ ఆలయం సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కృష్ణాజిల్లా చినగొల్లపాలేనికి చెందిన సడగం సత్యవతి (32) మృతిచెందారు. నరసాపురం టౌన్ ఎస్సై వై.యుగంధర్ తెలిపిన వివరాల ప్రకారం.. సత్యవతి భర్త శ్రీనివాసరావుతో కలసి మోటార్ సైకిల్‌పై యలమంచిలి మండలం బాడవ గ్రామానికి బంధువుల ఇంటికి వెళుతున్నారు. మార్గమధ్యలో ఉదయం 11.30 గంటల సమయంలో పట్టణంలోని మత్స్యపురి వంతెన దాటిన తర్వాత ఎదురుగా వస్తున్న మరో మోటార్‌బైక్ హ్యాండిల్ వీరికి తగిలింది. దీంతో సత్యవతి కిందపడగా వెనుక వస్తున్న లారీ ఆమె పైనుంచి దూసుకుపోయింది. దీంతో సత్యవతి శరీరం నుజ్జునుజ్జుయింది. ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. భర్త శ్రీనివాసరావు స్వల్పగాయూలతో బయటపడ్డారు. భార్య మృతితో అతను గుండెలవిసేలా రోదించాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.