‘బ్రాహ్మణీయ హిందూ ఫాసిజం నశించాలి’

Maoist Banners Appeared In G Madugula Over Article 370 Scrap - Sakshi

మల్కాన్ గిరి-విశాఖ బోర్డర్ డివిజన్ కమిటీ పేరిట వెలసిన బ్యానర్లు

సాక్షి, విశాఖపట్నం : జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు, రాష్ట్ర విభజన చేస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ పేరిట బ్యానర్లు వెలిశాయి. కశ్మీర్‌లో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయన్న కేంద్ర ప్రభుత్వ వాదనను ఎండగడుతూ... ‘కశ్మీర్‌ ప్రజలకు మద్దతుగా నిలుద్దాం. కశ్మీర్‌ పోరాటం గురించి పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్న ఫాసిస్టు మోడి ప్రభుత్వ చర్యను వ్యతిరేకిద్దాం’ అంటూ జి.మాడుగుల, మద్దిగురువుల్లో మల్కాన్ గిరి-విశాఖ బోర్డర్ డివిజన్ కమిటీ పేరిట వెలసిన బ్యానర్లు కలకలం రేపుతున్నాయి.

‘స్వయం నిర్ణయాధికారం కశ్మీర్‌ ప్రజల జన్మహక్కు. బ్రాహ్మణీయ హిందూ ఫాసిజం నశించాలి. నరహంతక మోదీ ఫాసిస్టు ప్రభుత్వ చర్యను వ్యతిరేకిద్దాం. కశ్మీర్‌ ప్రజలపై అమలు జరుపుతున్న దారుణ మారణకాండను వ్యతిరేకించుదాం’ అంటూ మావోయిస్టు పార్టీ(సీపీఐ) నేతలు బ్యానర్లలో పిలుపునిచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top