విద్యా నిర్వాణ బర్త్డే, తిరుమలలో మంచు లక్ష్మీ | manchu laxmi celebrates her doughter at tirumala | Sakshi
Sakshi News home page

విద్యా నిర్వాణ బర్త్డే, తిరుమలలో మంచు లక్ష్మీ

Jun 15 2015 12:45 PM | Updated on Sep 3 2017 3:47 AM

సినీ నటి, మంచు లక్ష్మి సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

తిరుపతి : సినీ నటి, మంచు లక్ష్మి సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన కూమార్తె 'విద్యా నిర్వాణ మంచు ఆనంద్' మొదటి పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుమల వచ్చారు. స్వామివారి దర్శనం బాగా అయిందని ఆమె తెలిపారు. తనకి వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో ఇష్టమని... అందుకే నిర్వాణ మొదటి పుట్టిన రోజు సందర్భంగా ముందుగా స్వామివారి దర్శనానికి వచ్చామని చెప్పారు. తమ పాప పుట్టినరోజును గ్రాండ్‌గా కాకుండా... ఓ అనాథ ఆశ్రమంలో పిల్లలందరి మధ్య జరుపుకుంటున్నట్లు మంచు లక్ష్మి పేర్కొన్నారు.


 

 

Advertisement
 
Advertisement
Advertisement