వ్యక్తి అనుమానాస్పద మృతి | man suspicious death in srikakulam distirict | Sakshi
Sakshi News home page

వ్యక్తి అనుమానాస్పద మృతి

Apr 24 2015 9:36 AM | Updated on Sep 2 2018 4:48 PM

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి గ్రామంలో ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి గ్రామంలో ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్రామానికి చెందిన లండ కృష్ణ(40), మరో వ్యక్తి కలసి గురువారం రాత్రి మద్యం తాగారు. అనంతరం వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుందని స్తానికులు తెలిపారు. అయితే శుక్రవారం ఉదయం గ్రామంలోని మురుగు కాల్వలో కృష్ణ మృతదేహమై కనిపించాడు. వ్యక్తిగత కలహాల నేపథ్యంలోనే ఈ దారుణం జరిగి ఉంటుందని గ్రామస్తులు అంటున్నారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కృష్ణకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
(వజ్రపుకొత్తూరు)

Advertisement
 
Advertisement
Advertisement