పోలీసులు అనుమానించారని ఆత్మహత్య | man suicides in guntakal | Sakshi
Sakshi News home page

పోలీసులు అనుమానించారని ఆత్మహత్య

Sep 20 2015 9:49 AM | Updated on Sep 3 2017 9:41 AM

అనంతపురం జిల్లా గుంతకల్లులో దారుణం చోటుచేసుకుంది.

గుంతకల్లు: అనంతపురం జిల్లా గుంతకల్లులో దారుణం చోటుచేసుకుంది. తిమ్మాపురంలోఇటీవల జరిగిన చోరీ కేసులో నాగశేషు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి వదిలేశారు. పోలీసులు అనుమానించారని మనస్తాపం చెందిన నాగశేషు ఆదివారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.

గమనించిన స్థానికులు బాధితుణ్ని వెంటనే కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందులూ నాగశేషు మృతి చెందాడు. అదే విధంగా గత వారంలో చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో జరిగిన లాకప్ డెత్పై ప్రభుత్వం స్పందించింది.  అనుమానాస్పద స్థితిలో మరణించిన బత్తెన శ్రీరాములు మృతిపై కలెక్టర్ కోన శశిధర్ మెజిస్టిరీయల్ విచారణకు ఆదేశించారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement