breaking news
nagaseshu
-
ఏసీబీకి చిక్కిన సంక్షేమ శాఖ ఈఈ
నల్లగొండ: సాంఘీక సంక్షేమ శాఖలో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్‌గా పని చేస్తున్న ఎ. నాగశేషు ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. ముందస్తు సమాచారంతో కార్యాలయానికి వచ్చిన ఏసీబీ అధికారులు.. నాగశేషు కాంట్రాక్టర్ నుంచి రూ. 27 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అదనపు సమాచారం కోసం విచారణ చేపడుతున్నారు. -
పోలీసులు అనుమానించారని ఆత్మహత్య
గుంతకల్లు: అనంతపురం జిల్లా గుంతకల్లులో దారుణం చోటుచేసుకుంది. తిమ్మాపురంలోఇటీవల జరిగిన చోరీ కేసులో నాగశేషు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి వదిలేశారు. పోలీసులు అనుమానించారని మనస్తాపం చెందిన నాగశేషు ఆదివారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. గమనించిన స్థానికులు బాధితుణ్ని వెంటనే కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందులూ నాగశేషు మృతి చెందాడు. అదే విధంగా గత వారంలో చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో జరిగిన లాకప్ డెత్‌పై ప్రభుత్వం స్పందించింది. అనుమానాస్పద స్థితిలో మరణించిన బత్తెన శ్రీరాములు మృతిపై కలెక్టర్ కోన శశిధర్ మెజిస్టిరీయల్ విచారణకు ఆదేశించారు.