ఏపీ డీఎస్సీ అక్రమాలు.. ఈ ప్రశ్నలకు బదులేదీ? | Allegations On AP Dsc: Kona Sasidhar Evades Questions | Sakshi
Sakshi News home page

ఏపీ డీఎస్సీ అక్రమాలు.. ఈ ప్రశ్నలకు బదులేదీ?

May 30 2026 8:26 PM | Updated on May 30 2026 9:07 PM

Allegations On AP Dsc: Kona Sasidhar Evades Questions

సాక్షి, విజయవాడ: డీఎస్సీపై మీడియా సమావేశం నిర్వహించిన విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్.. డీఎస్సీ అక్రమాల ఆరోపణలపై సమాధానాలు దాటవేశారు. కీలకమైన ఆరోపణలకు ఆయన సమాధానం ఇవ్వలేదు. ఎస్‌ఈఆర్టీలో పనిచేసే నవీవ్‌కి టాప్ ర్యాంక్‌పై మీడియా ప్రశ్నించగా.. కోన శశిధర్‌ మూడు రకాలుగా సమాధానం చెప్పారు. అనుమతి తీసుకోలేదు కాబట్టి పక్కనపెట్టామన్న శశిధర్.. మరోసారి కౌన్సిలింగ్‌కి రాలేదు కాబట్టి పక్కన పెట్టామంటూ చెప్పుకొచ్చారు. అతను రెండు పరీక్షలు రాశాడంటూ మరో సమాధానం చెప్పారు. 6 వేల ప్రశ్నలు గుర్తుపెట్టుకుని చేసేశాడంటే నమ్మశక్యమా? అంటూ కోన శశిధర్ వింత సమాధానం ఇచ్చారు.

నవీన్ లాగిన్‌ని ఎందుకు బ్లాక్ చేశారని మీడియా ప్రశ్నించగా.. దానిపై కూడా  కోన శశిధర్ సమాధానం చెప్పలేదు. స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్లపై తప్పించుకునే ధోరణి ప్రదర్శించారు. స్పోర్ట్స్ కోటా అంతా స్పోర్ట్స్‌ డిపార్ట్‌మెంట్‌నే అడగండంటూ దాటవేశారు. రెగ్యులర్, స్పోర్ట్స్ కోటా ఒకేసారి ఎందుకు చేయలేదో స్పష్టత ఇవ్వని శశిధర్‌.. స్పోర్ట్స్ కోటా జీవోలు మార్పుపై తనకు సంబంధం లేదని దాటవేశారు.

స్పోర్ట్స్ పాలసీ ప్రకారం మేము అనుసరించాం. ఆ రోజు స్పోర్ట్స్ పాలసీ ప్రకారం పరీక్ష లేకపోయినా ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నాం. తర్వాత పాలసీని మార్చారు. స్పోర్ట్స్ పాలసీపై చర్చ వాళ్లనే అడగాలి. స్పోర్ట్స్ ది సెపరేట్‌గా హ్యాండిల్ చేద్దాం. జీఏడీ ఇచ్చిన జీవో ప్రకారం మేం చేశాం’’ అంటూ శశిధర్‌ చెప్పుకొచ్చారు. స్పోర్ట్స్ కోటాలో అక్రమాల ఆరోపణలపై  ప్రభుత్వం ఇప్పటికీ స్పందించలేదు. టెట్, డీఎస్సీకి ఒకే కన్వీనర్ నియమాకాన్ని శశిధర్ సమర్థించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement