మండలంలోని లగిసెపల్లి గ్రామంలో గురువారం మధ్యాహ్నం ఉపాధి పనులు చేస్తుండగా వడదెబ్బ తగిలి నెల్లూరు నరసింహమూర్తి (40) అనే వ్యక్తి మరణించాడు.
పాడేరు (విశాఖపట్నం జిల్లా) : మండలంలోని లగిసెపల్లి గ్రామంలో గురువారం మధ్యాహ్నం ఉపాధి పనులు చేస్తుండగా వడదెబ్బ తగిలి నెల్లూరు నరసింహమూర్తి (40) అనే వ్యక్తి మరణించాడు. తోటి కూలీలు సపర్యలు చేస్తుండగానే నరసింహమూర్తి ప్రాణాలొదిలాడు. ఆయన మరణంతో కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.