అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి | man dies in mysterious condition | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

Mar 16 2015 8:24 PM | Updated on Sep 2 2017 10:56 PM

అనుమానాస్పదంగా వ్యక్తి మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని గంగాబస్తీలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది.

కొత్తగూడెం : అనుమానాస్పదంగా వ్యక్తి మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని గంగాబస్తీలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. గంగాబస్తీకి చెందిన పేరం బుచ్చిబాబు (30) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతను అనారోగ్యంతో ఈ రోజు మధ్యాహ్నం మృతిచెందాడు. విషయం తెలిసిన బంధువులు మృతదేహాన్ని చూడటానికి వచ్చారు.

ఈ సమయంలో అతని మెడ వెనుక భాగంలో తాడు గుర్తులు కనిపించడంతో భార్యే చంపి ఉంటుందని అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement