కుటుంబ కలహాలతో ఒక వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
బేతంచర్ల (కర్నూలు జిల్లా) : కుటుంబ కలహాలతో ఒక వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం కర్నూలు జిల్లా బేతంచర్ల మండలం ఆర్.ముక్కాపురం గ్రామంలో జరిగింది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎర్రమల్ల రాముడు(36) వ్యవసాయ కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య రామాంజనమ్మ, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.
అయితే వారి కుటుంబంలో గత కొంతకాలంగా గొడవలు జరుగుతుండటంతో రామాంజనమ్మ, పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య తిరిగి రాకపోవడంతో మనస్తాపం చెందిన రాముడు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.