
కారులో మంటలు.. వ్యక్తి సజీవదహనం
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దానవాయిపేటలో కారులో మంటలు చెలరేగి ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దానవాయిపేటలో కారులో మంటలు చెలరేగి ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. నారాయణపురానికి చెందిన దాసరి సోమరాజు తన మారుతీ కారులో ఇంటర్‌నెట్ సెంటరుకు వెళ్తుండగా అదుపుతప్పి పక్కనే ఉన్న మురుగు కాలువలోకి దూసుకెళ్లింది.
కారులో ఉన్న ఎల్పీజీ కిట్ నుంచి గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న సోమరాజు పూర్తిగా కాలిపోయాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించినా, ఫలితం లేకుండా పోయింది. దాంతో అక్కడికక్కడే మరణించాడు.