షార్ట్ సర్క్యూట్: వ్యక్తి సజీవ దహనం | Man burned alive in guntur district | Sakshi
Sakshi News home page

షార్ట్ సర్క్యూట్: వ్యక్తి సజీవ దహనం

May 24 2015 6:31 PM | Updated on Sep 3 2017 2:37 AM

గుంటూరు జిల్లా కొల్లిపర్ర మండలం దంతలూరులో ఆదివారం ప్రమాదవశాత్తూ ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు.

గుంటూరు: గుంటూరు జిల్లా కొల్లిపర్ర మండలం దంతలూరులో ఆదివారం ప్రమాదవశాత్తూ ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. వివరాలు..  దంతలూరు గ్రామానికి చెందిన జ్యోతుల ఏలియ్య(70) ఇంట్లో నిద్రిస్తుండగా షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. రెండు నిమిషాల్లో మంటలు గది నిండా వ్యాపించాయి. గది నుంచి బయటకు వచ్చేందుకు వీలు కాకపోవడంతో ఇంట్లోనే సజీవంగా దహనమయ్యాడు. ఏలియ్యను కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించినా ఫలితం లేదు. భార్యా, మనవడు పొరుగూరిలో పెళ్లి నిమిత్తం రెండు రోజుల క్రితం వెళ్లారు.
(కొల్లిపర్ర)

Advertisement
 
Advertisement
Advertisement