గొడవలకు దిగితే కఠిన చర్యలు

Mahesh Chandra Laddha Warning To Rowdy Sheeters Visakhapatnam - Sakshi

నగర పర్యాటకులకు ఇబ్బందులు కలిగించొద్దు

మద్యం దుకాణాల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరి

అర్ధరాత్రి మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు

అవాంఛనీయ ఘటనలకు స్టేషన్‌ అధికారులదే బాధ్యత

విశాఖ క్రైం: నగరంలోని మద్యం దుకాణాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఎడమవైపు ఆర కిలోమీటరు, కుడివైపు ఆర కిలో మీటర్‌ పరిధిలో జరిగే వ్యవహారాలన్నీ కనిపించేలా అధిక రిజల్యూషన్‌ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌చంద్రలడ్డా ఆదేశించారు. ‘సాక్షి’తో బుధవారం ఆయన మాట్లాడారు. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇప్పటికే నేరాలపై దృష్టి సారించి పలు కేసుల్లో నిందితులను అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలోని రౌడీషీటర్లు హత్యలు, గొడవులకు పాల్పడడంతోపాటు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే స్టేషన్‌కు సంబంధించిన అధికారే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. అదేవిధంగా స్టేషన్‌లో లంచాలు తీసుకున్నారనే సమాచారం వస్తే  చర్యలు తప్పవన్నారు. ఫిర్యాదుదారులను డబ్బులు అడిగితే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.

మద్యం దుకాణాల వద్ద రాత్రి వేళల్లో గస్తీ పెంచామని, ఇప్పటికే చిన్న చిన్న గొడవులు లేకుండా చర్యలు చేపట్టామని తెలిపారు.
నగరానికి వచ్చిన పర్యాటకులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పర్యాటకులకు రక్షణ కలిగించేందుకు త్వరలో చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.

చైన్‌ స్నాచర్‌లపై ప్రత్యేక దృష్టి
చైన్‌స్నాచర్‌లపై ప్రత్యేక దృష్టి సారించామని, ఎక్కడైనా స్నాచింగ్‌ జరిగితే సిబ్బంది వెంటనే అప్రమత్తం కావాలని సూచించారు. స్నాచర్లను పట్టుకునేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. అదేవిధంగా పాత నేరస్తులపై కూడా ప్రత్యేక నిఘా పెట్టామని, రోజూ ఓ బృందం నిఘా పర్యవేక్షిస్తుందని తెలిపారు.

సీసీ కెమెరాలతో పర్యవేక్షణ
వ్యాపార సముదాయాలు, అపార్ట్‌మెంట్లు వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచిం చారు. దొంగతనాలు, ఇతర అఘాయిత్యాలు జ రిగినప్పుడు వెంటనే నిందితులను గుర్తించి ప ట్టుకునేందుకు సీసీ కెమెరాల ఫుటేజీ దోహదపడుతుందన్నారు. ఇప్పటికే జీవీఎంసీ, పోలీసు శాఖ తరఫున పలుచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నగరంలోని చాలా ప్రాం తాలను సీసీ కెమెరాల ద్వారా పర్యేవేక్షిస్తున్నామని తెలిపారు.

రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్‌
పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని రౌడీ షీటర్లుకు రెండు రోజులుగా కౌన్సిలింగ్‌ ఇస్తున్నామని సీపీ తెలిపారు. ప్రతి ఆదివారం పోలీస్‌ స్టేషన్‌కు హాజరుకావాలని సూచించా మని, వారి ప్రవర్తనపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. నగరంలో సుమారు 400 మంది రౌడీషీటర్ల కదలికలపై పై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top