మాగంటికి అమెరికా ఆహ్వానం | Maganti Babu invitation America | Sakshi
Sakshi News home page

మాగంటికి అమెరికా ఆహ్వానం

Jun 26 2014 12:50 AM | Updated on Aug 10 2018 8:08 PM

మాగంటికి అమెరికా ఆహ్వానం - Sakshi

మాగంటికి అమెరికా ఆహ్వానం

అమెరికా రావాల్సిందిగా ఏలూరు ఎంపీ మాగంటి బాబుకు ఆహ్వానం అందింది. అక్టోబర్ 2న అమెరికాలో జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోడీని

ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : అమెరికా రావాల్సిందిగా ఏలూరు ఎంపీ మాగంటి బాబుకు ఆహ్వానం అందింది. అక్టోబర్ 2న అమెరికాలో జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోడీని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆహ్వానించిన విషయం విదితమే, అదే కార్యక్రమానికి రావాల్సిందిగా అమెరికా నుంచి తనకూ ఆహ్వానం అందిందని మాగంటి బాబు బుధవారం తెలిపారు.

 బెల్టు షాపులు లేకుండా చూడండి
 మద్యం ఎక్కడబడితే అక్కడ అందుబాటులో లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ మాగంటి బాబు ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్ చంద్రశేఖరనాయుడు, సూపరింటెండెంట్ వి.రేణుకను ఆదేశించారు. ఎంపీ బాబును వారిద్దరూ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ధేశించిన దుకాణాల్లో మాత్రమే మద్యం విక్రయూలు జరిగేలా చూడాలని, ఎక్కడైనా బెల్టు షాపులు కనిపిస్తే అందుకు ఆ ప్రాంత ఎక్సైజ్ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement