
శ్రావణజ్యోతి చిన్నా(ఫైల్)
గిడ్యాల: కుల పెద్దల సమక్షంలో ఎదురైన అవమానాన్ని జీర్ణించుకోలేని ఓ యువకుడు చాకుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన లక్ష్మాపురం ఎస్సీకాలనీలో ఆదివారం కలకలం రేపింది. బాధితుడి భార్య వివరాల మేరకు..వెంకటాపురం గ్రామానికి చెందిన శ్రావణజ్యోతి అవ్వతాతల ఊరైన లక్ష్మాపురం వెళ్లేది. ఈక్రమంలో గ్రామానికి చెందిన ప్రభుదాసు కుమారుడు చిన్నాతో పరిచయం పెంచుకుంది. పరిచయం కాస్త ప్రేమగా మారడంతో తల్లిదండ్రులు, బంధువులను ఎదురించి గ్రామపెద్దల సమక్షంలో ఆరు నెలల క్రితం నందికొట్కూరు బ్రహ్మంగారి మఠం వద్ద పెళ్లి చేసుకుంది.
చిన్నా పెంచుకున్న బాతులు శ్రావణజ్యోతి అవ్వ ఇంటి పరిసరాల్లోకి వెళ్లడంతో గొడవ జరిగింది. ఈక్రమంలో చిన్నా తన భార్య పిన్ని దివ్యభారతిని అసభ్య పదజాలంతో దూషించాడని ఉదయం కుల పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. దీన్ని అవమానంగా భావించిన అతడు ఇంట్లోకి వెళ్లి చాకుతో గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై తమకు ఎలాంటి సమచారం అందలేదని ముచ్చుమర్రి ఏఎస్‌ఐ కృష్ణుడు తెలిపారు.