ప్రేమ పేరుతో ‘పోలీసు’ మోసం | Love name of the 'police' fraud | Sakshi
Sakshi News home page

ప్రేమ పేరుతో ‘పోలీసు’ మోసం

Jun 23 2014 1:53 AM | Updated on Sep 2 2017 9:13 AM

కుటుంబ కలహాల కారణంగా భర్త దూరం కావడంతో కుమారుడితో పుట్టింట్లో ఉంటున్న శీలం సౌజన్య అనే మహిళ అనూహ్యంగా మోసపోయింది.

విజయవాడ: కుటుంబ కలహాల కారణంగా భర్త దూరం కావడంతో కుమారుడితో పుట్టింట్లో ఉంటున్న శీలం సౌజన్య అనే మహిళ అనూహ్యంగా మోసపోయింది. ప్రకాశం జిల్లా పొదిలి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా ఉన్న మాతాబత్తిన రాజేష్ అనుకోకుండా మిస్డ్‌కాల్ ద్వారా ఆమెకు పరిచయమయ్యాడు. అనంతరం ప్రేమలో పడ్డ వీరు గుళ్లో పెళ్లి చేసుకున్నాక కొన్నాళ్లు కాపురం చేశారు.

ఆ తర్వాత ఆమె డబ్బును వాడుకుని మరొకరిని వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడని మొగల్రాజపురానికి చెందిన సౌజన్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజేష్ కొన్ని రోజులుగా ఆమెతో సక్రమంగా ఉండకపోగా కనిపించకుండా వెళ్లిపోయాడు. అతడిని కలిసేందుకు పొదిలికి వెళ్లిన ఆమెను అత డి బంధువులు దూషించారు. ఈ నెల 21న రాజేష్‌కు మరో యువతితో పెళ్లి జరుగనున్నట్లు తెలిసింది.  
 
 

Advertisement
 
Advertisement
Advertisement