breaking news
sowjaniah
-
రన్నరప్ సౌజన్య జంట
హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మారుు సౌజన్య భవిశెట్టి డబుల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది. పుణేలో శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో సౌజన్య-రిషిక సుంకర (భారత్) జోడీ 2-6, 1-6తో టాప్ సీడ్ ఇరీనా ఖరోమచెవా (రష్యా)-అలెగ్జాండ్రినా నెదెనోవా (బల్గేరియా) ద్వయం చేతిలో ఓడిపోరుుంది. -
భార్యను కత్తితో పొడిచి చంపిన ఎస్సై
కన్న బిడ్డల ఎదుటే దారుణం ఆర్థిక ఇబ్బందులే కారణమని వెల్లడి హైదరాబాద్: జీవితాంతం తోడుండాల్సిన భర్తే ఆమె పాలిట కాలయముడుగా మారాడు.. ఆర్థిక సమస్యలతో ఆవేశానికి లోనై తనలో సగభాగాన్ని కిరాతకంగా చంపేశాడు. కన్నబిడ్డల ఎదుటే భార్యను కత్తితో పొడిచి చివరికి పోలీసులకు లొంగిపోయాడు. ఈ సంఘటన శుక్రవారం హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీ పరిధిలో చోటుచేసుకుంది. కేపీహెచ్‌బీ సీఐ శ్రీకాంత్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కడప పట్టణానికి చెందిన భానుప్రకాశ్ (45), సౌజన్య(37)లది ప్రేమ వివాహం. వీరికి తన్మయ్, కౌశిక్ ఇద్దరు సంతానం. ప్రస్తుతం కేపీహెచ్‌బీ కాలనీ సమతానగర్ ప్రసాద్ రెసిడెన్సీ అపార్టుమెంట్లో నివసిస్తున్నారు. కాగా, భానుప్రకాష్ నగరంలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సమయంలోనే అధికారులకు చెప్పకుండా మూడేళ్ల పాటు దీర్ఘకాలిక సెలవు తీసుకున్నాడు. దీంతో అధికారులు పలుమార్లు అతనికి నోటీసులు జారీ చేశారు. అయినా భానుప్రకాశ్ నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో గత ఏడాది అతడిని సస్పెండ్ చేశారు. నాలుగు నెలల కిందటే కేపీహెచ్‌బీ కాలనీలోని ప్రసాద్ రెసిడె న్సీలో వీరి కుటుంబం అద్దెకు దిగింది. ఉద్యోగం పోవడంతో జీతం లేక ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ తరుణంలో దంపతులిద్దరూ రోజూ గొడవ పడేవారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం భానుప్రకాశ్, సౌజన్యల మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. ఆవేశానికిలోనైన భానుప్రకాష్ కత్తితో పొడిచి భార్యను దారుణంగా హత్య చేశాడు. తర్వాత తన ఇద్దరు పిల్లలను ఆల్విన్‌కాలనీలో ఉంటున్న తల్లిదండ్రుల వద్ద ఉంచాడు. అనంతరం కేపీహెచ్‌బీ పోలీసుల ముందు లొంగిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
ప్రేమ పేరుతో ‘పోలీసు’ మోసం
విజయవాడ: కుటుంబ కలహాల కారణంగా భర్త దూరం కావడంతో కుమారుడితో పుట్టింట్లో ఉంటున్న శీలం సౌజన్య అనే మహిళ అనూహ్యంగా మోసపోయింది. ప్రకాశం జిల్లా పొదిలి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా ఉన్న మాతాబత్తిన రాజేష్ అనుకోకుండా మిస్డ్‌కాల్ ద్వారా ఆమెకు పరిచయమయ్యాడు. అనంతరం ప్రేమలో పడ్డ వీరు గుళ్లో పెళ్లి చేసుకున్నాక కొన్నాళ్లు కాపురం చేశారు. ఆ తర్వాత ఆమె డబ్బును వాడుకుని మరొకరిని వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడని మొగల్రాజపురానికి చెందిన సౌజన్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజేష్ కొన్ని రోజులుగా ఆమెతో సక్రమంగా ఉండకపోగా కనిపించకుండా వెళ్లిపోయాడు. అతడిని కలిసేందుకు పొదిలికి వెళ్లిన ఆమెను అత డి బంధువులు దూషించారు. ఈ నెల 21న రాజేష్‌కు మరో యువతితో పెళ్లి జరుగనున్నట్లు తెలిసింది.