గుంటూరు జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదంలో నలుగురు గాయపడ్డారు.
గుంటూరు: గుంటూరు జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. రొంపిచెర్ల మండలం ఇప్పన్న గ్రామ శివారులోని అద్దంకి-నార్కెట్‌పల్లి జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు లారీని ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది.
ముందు వెళుతున్న లారీని వెనుక వేగంగా వచ్చిన వెంకటగిరి డిపోకు చెందిన సూపర్‌లగ్జరీ బస్సు ఢీకొట్టింది. ఈ సంఘటనలో బస్సులోని నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. దీంతో ప్రయాణికులను మరో బస్సులో గమ్యానికి చేర్చారు. క్షతగాత్రులకు రొంపిచెర్ల ప్రభుత్వాస్పత్రిలో ప్రాధమిక చికిత్స అందించారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.