లారీ బ్రేకులు ఫెయిల్.. గరివిడిలో గందరగోళం | lorry accident in viyanagaram district | Sakshi
Sakshi News home page

లారీ బ్రేకులు ఫెయిల్.. గరివిడిలో గందరగోళం

Feb 10 2016 10:15 AM | Updated on Sep 3 2017 5:22 PM

వేగంగా వెళ్తున్న లారీ బ్రేకులు ఫెయిలవడంతో విజయనగరం జిల్లా గరివిడిలో గందరగోళం నెలకొంది.

చీపురుపల్లి: వేగంగా వెళ్తున్న లారీ బ్రేకులు ఫెయిలవడంతో విజయనగరం జిల్లా గరివిడిలో గందరగోళం నెలకొంది. అనంతరం డ్రైవర్ చాకచక్యంతో పెను ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి ట్రాన్స్‌పోర్టు లోడుతో రాజాం వెళ్తున్న సమయంలో స్థానిక సబ్‌స్టేషన్ వద్దకు రాగానే లారీ బ్రేకులు ఫెయిలయ్యాయి.

దీంతో లారీ రోడ్డు పక్కన ఉన్న వారి పైకి దూసుకెళ్లింది. దీంతో స్థానికులు ఏం జరుగుతుందో తెలియక పరుగులు తీశారు. ఆ సమయంలో డ్రైవర్ సమయస్పూర్తిని ప్రదర్శించి లారీని రోడ్డు పక్కన ఉన్న దిమ్మపైకి ఎక్కించాడు. దీంతో లారీ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement