కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ | Lockdown Success in Vizianagaram | Sakshi
Sakshi News home page

కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌

Mar 27 2020 1:16 PM | Updated on Mar 27 2020 1:16 PM

Lockdown Success in Vizianagaram - Sakshi

చీపురుపల్లి మండలం మెట్టపల్లి గ్రామంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిపై సర్వే చేస్తున్న వలంటీర్లు, వైద్య సిబ్బంది

సాక్షిప్రతినిధి, విజయనగరం: కరోనా మహమ్మారిని అడ్డుకోవడానికి జిల్లా వ్యాప్తంగా తొమ్మిది నియోజక వర్గాల్లోనూ ఎక్కడికక్కడ లాక్‌ డౌన్, 144 సెక్షన్లు పటిష్టంగా అమలవుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో నూ  ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో అనేక చర్యలు తీసుకుంటున్నారు. జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. నిత్యావసర సరుకులు, కూరగాయలు వంటివి కొనుగోలు చేసుకునేందుకు నిర్ణీత సమయాల్లోనే అనుమతిస్తున్నారు. నిర్ధిష్ట దూ రాన్ని పాటిస్తూ ప్రజలు ఆయా సమయాల్లో బయటకు వస్తున్నారు. మిగతా సమయమంతా ఇంటికే పరిమితమవుతున్నారు. గిరిజన గ్రామాలతో పాటు జిల్లాలోని అనేక గ్రామాలకు దారులను మూసేశారు. బయటివారినెవ్వరినీ గ్రామాల్లోకి రానివ్వడం లేదు. ఆశ వర్కర్లు, వలంటీర్లు, ఏఎన్‌ఎంలు ఇంటింటికీ తిరిగి విదేశాల నుంచి వచ్చినవారు, కరోనా లక్షణా లున్న వ్యక్తులెవరైనా ఉన్నారేమోనని ఆరాతీస్తున్నారు. జిల్లాకు చెందిన ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు నిత్యం అధికారులతో మాట్లాడుతున్నారు. అవసరమైన సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు.

జాగ్రత్తలు పాటిస్తున్న జనం
ప్రజల్లో చైతన్యం క్రమక్రమంగా పెరుగుతోంది. నిత్యావసర సరకుల కోసం కేటాయించిన సడలింపు సమయంలో పరిమితంగా రోడ్లపైకి వస్తూ ప్రభుత్వం నిర్దేశించిన జాగ్రత్తలను పాటిస్తున్నారు.  విక్రయ కేంద్రాల వద్ద ప్రజలు సామాజిక దూరం పాటించడంతో పాటు ముఖానికి మాస్క్‌లు ధరించి వైరస్‌ వ్యాప్తిని నివారించే దిశగా కనిపించారు. జిల్లాలోని రైతుబజా ర్లను మూసేసి, విశాలమైన మైదానాల్లో దూరదూరంగా దుకాణాలు ఏర్పాటు చేయడంతోపాటు మార్కింగ్‌ చేసి కొనుగోలు దారులు నిలబడేలా చేస్తున్న చర్య లు సత్ఫలితాలనిచ్చాయి. కొత్తవలస. జామి, పూస పాటిరేగ, భోగాపురం, కరుపాం, సాలూరు పట్టణం, ఇతర మండల కేంద్రాల్లోని కూరగాయల దుకాణాలను విశాలమైన ప్రాంతాలకు మార్చారు. జిల్లాలోని అనేక గ్రామాల్లో ఇతరులు రావొద్దంటూ కంచెలు ఏర్పాటు చేస్తున్నారు.

క్వారంటైన్‌ ఏర్పాట్లు ముమ్మరం
జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. చీపురుపల్లిలో అయిదు విద్యాసంస్థలను గుర్తించారు. ఆ భవనాల్లో వంద బెడ్లు, ఆరోగ్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ అధికారులను ఆదేశించారు. బొబ్బిలి గ్రోత్‌ సెంటర్‌ సమీపంలోని ఎస్సీ కాలేజ్‌ హాస్టల్‌లో వంద పడకల క్వారంటైన్‌ సెంటర్‌ ఏర్పా టు చేసేందుకు నిర్ణయించారు. పార్వతీపురం, సాలూ రు, విజయనగరంలోనూ క్వారంటైన్‌ కేంద్రాల ఏర్పాటును ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. శృంగవరపుకోటలో దినసరి కూలీలకు ప్రత్యేకంగా భోజ నం ఏర్పాటు చేసేందుకు ఎమ్మె ల్యే కడుబండి శ్రీని వాసరావు, అక్కడి పార్టీ నేతలు ఏర్పాటు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement