10వ తరగతి విద్యార్థి అదృశ్యం | Little flower high school 10th Class Student missing in Bhadrachalam | Sakshi
Sakshi News home page

10వ తరగతి విద్యార్థి అదృశ్యం

Feb 1 2014 9:22 AM | Updated on Sep 2 2017 3:15 AM

భద్రాచలంలోని లిటిల్ఫ్లవర్స్ స్కూల్ హాస్టల్లో ఉంటూ పదో తరగతి చదువుతున్న గడ్డం శివకుమార్ అనే విద్యార్థి అదృశ్యమయ్యాడు.

భద్రాచలంలోని లిటిల్ఫ్లవర్స్ హాస్టల్లో ఉంటూ పదో తరగతి చదువుతున్న గడ్డం శివకుమార్ అనే విద్యార్థి అదృశ్యమయ్యాడు. దాంతో అతడి తల్లితండ్రులు శనివారం ఉదయం పోలీసులను ఆశ్రయించారు. తమ కుమారుడు రెండు రోజుల నుంచి కనిపించడం లేదంటూ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

తమ కుమారుడి కోసం ఈ రోజు ఉదయం హాస్టల్ వెళ్లామని, అయితే అతడు గత రెండు రోజులుగా హాస్టలు ఉండటం లేదంటూ లిటిల్ ఫ్లవర్ యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిందని శివకుమార్ తల్లితండ్రులు పోలీసులకు చేసిన ఫిర్యాదులో వెల్లడించారు. దాంతో తమ కుమారుడి ఆచూకీ తెలపాలంటూ వారు పోలీసులను ఆశ్రయించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement