గాయకులకు జీవితసాఫల్య పురస్కారాలు | life time achievment awards for singers | Sakshi
Sakshi News home page

గాయకులకు జీవితసాఫల్య పురస్కారాలు

Nov 20 2017 8:51 AM | Updated on Nov 20 2017 8:51 AM

life time achievment awards for singers - Sakshi

పుట్టపర్తి అర్బన్‌: సత్యసాయి జయంతి ఉత్సవాల సందర్భంగా ఆదివారం రాత్రి ప్రశాంతి నిలయం సాయికుల్వంత్‌ హాలులో గాయకులకు జీవిత సాఫల్య పురస్కారాలు అందజేశారు. ప్రముఖ గాయని పి.సుశీలతోపాటు దానా గిలెస్పీలను ఈశ్వరమ్మ ఉమెన్స్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ చేతనారాజు, అరకు ఎంపీ కొత్తపల్లి గీత సత్కరించి పురస్కారాలు అందజేశారు. సత్యసాయిబాబా సన్నిధిలో లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డులు తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా దానా గిలెస్పీ కర్ణాటక సంగీతంతో సత్యసాయి గీతాలతో మైమరిపించారు.

సత్యసాయి తమ జీవితాలకు మూలస్తంభం లాంటివారని పురస్కార గ్రహీతలు పేర్కొన్నారు. అనంతరం సత్యసాయి ప్రైమరీ స్కూల్‌ విద్యార్థులు సత్యసాయి, శివుడు, షిర్డీసాయి పలు అవతార ఘట్టాలను వేదికపై ప్రస్ఫుటింపజేశారు. నాటికలతో పాటు నృత్యాలు చేస్తూ మహిళా దినోత్సవాన్ని రంజింపజేశారు. అనంతరం ఈశ్వరమ్మ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఆహుతులను సన్మానించారు. మహామంగళ హారతి, భజన కార్యక్రమాలు కొనసాగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement